టీఎస్ ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సొంత రాష్ట్రంలోనే పరీక్ష రాసేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది. దరఖాస్తుల్లో సవరణలకు అనుమతించింది. ఏపీలోని కేంద్రాలలో పరీక్ష రాయాలనుకునేవారు ఈ నెల 23లోగా eamcet.tsche.ac.in లో కేంద్రం ఆప్షన్ మార్చుకోవచ్చని టీఎస్ ఎంసెట్ కన్వీనర్ ప్రొ.ఎ.గోవర్ధన్ ఓ ప్రకటనలో తెలిపారు. రెండో దశలో తెలంగాణ పరిధిలో కేంద్రాల మార్పునకు అనుమతిస్తామన్నారు. టీఎస్ ఎంసెట్ వచ్చే నెల 6 నుంచి 9 మధ్య జరగనున్న సంగతి తెలిసిందే.
టీఎస్ ఎంసెట్ రాసే ఏపీ విద్యార్థులకు సౌలభ్యం - రాష్ట్ర విద్యార్థుల వార్తలు
టీఎస్ ఎంసెట్ రాసే ఏపీ విద్యార్థులకు వారి సొంత రాష్ట్రంలోనే పరీక్ష నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పరీక్ష కేంద్రం మార్పునకు నేడు అవకాశం కల్పించింది.
టీఎస్ ఎంసెట్ రాసే ఏపీ విద్యార్థులకు సౌలభ్యం