నవంబరు 1వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర రాజధాని, జిల్లా కేంద్రాల్లోనూ ఏపీ అవతరణ దినోత్సవం జరపాలని ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వ మీడియా సలహాదారు జీవీడీ కృష్ణ మోహన్ నేతృత్వంలో పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ సహా 9 మంది అధికారులతో కూడిన కమిటీని నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం
నవంబర్ ఒకటో తేదీని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అవతరణ వేడుకలు నిర్వహణకు ప్రభుత్వ మీడియా సలహాదారు కృష్ణ మోహన్ నేతృత్వంలో, పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ సహా 9 మందితో కమిటీని నియమించింది.
Ap stater formation day
జిల్లాల్లో రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించాల్సిందిగా కలెక్టర్లకు సూచనలు ఇచ్చింది. 2014 నుంచి 2018 వరకు జూన్ 2 తేదీ.. ఆప్పాయింటెడ్ డే రోజున గత ప్రభుత్వం నవనిర్మాణ దీక్షలు నిర్వహించింది. గత ఏడాది నవంబర్1 తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇదీ చదవండి :ఎన్నికల సంఘంతో సమావేశానికి వైకాపా దూరం