రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 44,382 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 158 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. వైరస్ బాధితులెవరూ మృతి చెందలేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,87,010కు చేరింది.
రాష్ట్రంలో కొత్తగా 158 మందికి కరోనా నిర్ధారణ - కొత్తగా 158 మందికి కరోనా
రాష్ట్రంలో కొత్తగా 158 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 8,87,010కు చేరింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఒక్కరు కూడా మరణించలేదని వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.
రాష్ట్రంలో కొత్తగా 158 మందికి కరోనా నిర్ధారణ
గడిచిన 24 గంటల్లో 155 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకొని 8.78 లక్షల మంది ఇళ్లకు వెళ్లిపోయారు. రాష్ట్రంలో మెుత్తం మరణాల సంఖ్య 7,147కు చేరుకుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పరీక్షలు కోటీ 28 లక్షలకు పైగా నిర్వహించినట్లు పేర్కొంది.
ఇదీ చదవండి:రేపు సుప్రీంలో పంచాయతీ ఎన్నికల కేసు విచారణ.. బెంచ్ మార్పు