ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వచ్చే ఏడాది నుంచి మెడికల్ సీట్లు పెంపు - ఏపీలో మెడికల్ సీట్లు పెంపు వార్తలు

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలతో మరో మూడేళ్లలో నూతనంగా... ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్కొక్క మెడికల్ కాలేజీ రానుంది. వచ్చే ఏడాదికి సీట్లు పెంచటంతోపాటు... కొన్ని కాలేజీలు అందుబాటులోకి వస్తాయని... ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు.

ap-state-increasing-medical-seats-and-colleges-from-next-year
ap-state-increasing-medical-seats-and-colleges-from-next-year

By

Published : Jun 4, 2020, 10:12 AM IST

రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి మెడికల్ సీట్లు పెంచే యోచనలో అధికారులున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలతో మరో మూడేళ్లలో నూతనంగా... ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్కొక్క మెడికల్ కాలేజీ రానుంది. వచ్చే ఏడాదికి కొన్ని కాలేజీలు అందుబాటులోకి వస్తాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. దీంతో మెడికల్ సీట్లు భారీగా పెరిగే అవకాశం ఉంది.

నూతన కాలేజీలతో పాటు ప్రస్తుతం నెల్లూరు, గుంటూరు, విజయవాడ మెడికల్ కాలేజీల్లో వచ్చే ఏడాది నుంచి పీజీ సీట్లు పెంచాలని అధికారులు యోచిస్తున్నారు. దీనికి సంబంధించిన ఇన్ ​ఫ్రాస్ట్రక్చర్​ను పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:ఉభయతారకంగా కృష్ణా జలాలు.... సయోధ్యతోనే సత్ఫలితాలు

ABOUT THE AUTHOR

...view details