ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రైవేటు ల్యాబుల్లోనూ కరోనా పరీక్షలు.. నిర్ధరణ వేగవంతం - corona tests ap

రాష్ట్రంలో కరోనా నిర్ధరణ పరీక్షల సంఖ్యను రెట్టింపు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. తాజాగా 2 ప్రైవేట్‌ ప్రయోగశాలల్లో పరీక్షలకు అనుమతులు రాగా... జిల్లాకొక ప్రైవేట్‌ ల్యాబ్‌లో పరీక్షలు చేసేలా రంగం సిద్ధం చేస్తున్నారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ట్రూనాట్‌ కిట్లలో పరీక్షించాక... మళ్లీ ఆర్టీపీసీఆర్​కు పంపక్కర్లేదని చెబుతున్నారు.

Ap state Government steps towards increasing number of coronary diagnostic tests for corona
Ap state Government steps towards increasing number of coronary diagnostic tests for corona

By

Published : May 29, 2020, 10:02 AM IST

కరోనా వైరస్‌ నిర్ధరణ పరీక్షలను మరింత విస్తృతం చేసేందుకు నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం... రోజుకు 20 వేలు చొప్పున నిర్వహించేలా రంగం సిద్ధం చేస్తోంది. దీనికోసం అధిక సంఖ్యలో ట్రూనాట్‌ కిట్లను అందుబాటులోకి తీసుకురానుంది. కొన్ని ప్రైవేట్‌ వైద్యకళాశాలల్లోనూ పరీక్షల నిర్వహణకు అనుమతులిచ్చేందుకు సిద్ధమవుతోంది.

ప్రస్తుతం ట్రూనాట్‌ కిట్లలో పరీక్షలు చేసిన అనంతరం ఆర్టీపీసీఆర్​కు పంపుతుండగా... ఇకపై ఆ అవసరం ఉండబోదని అధికారులు అంటున్నారు. కొత్త తరహా ట్రూనాట్‌ కిట్లలో ఇకపై ఏ ఫలితమొస్తే అదే అంతిమమని స్పష్టం చేశారు. దీని వల్ల సమయం ఆదా కావడమే కాక.. పరీక్షల సంఖ్య సైతం పెరుగుతుందని భావిస్తున్నారు.

రెండింటికి ఐసీఎంఆర్​ అనుమతి

విజయవాడలోని అపోలో, మణిపాల్‌ ల్యాబుల్లోనూ నమూనాలు పరీక్షించేందుకు ఐసీఎంఆర్ ఆమోదం లభించింది. ప్రస్తుతం పరీక్షల సంఖ్యలో దేశంలోనే ఏపీ‌ అగ్రస్థానంలో ఉందని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

'భాజపాకు మెజార్టీ ఉంది.. ప్రత్యేక హోదా అడగలేకపోతున్నాం'

ABOUT THE AUTHOR

...view details