సంగం డెయిరీ కేసులో సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులను.. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్ చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరింది. దీనిపై సోమవారం విచారణ జరగనుంది. ప్రభుత్వం లేవనెత్తిన పలు అంశాల్ని పరిగణనలోకి తీసుకోవడంలో సింగిల్ జడ్జి పొరపాటు పడ్డారని అప్పీల్‌లో పేర్కొన్నారు.
ఫీడర్ బ్యాలెన్సింగ్ డైరీని గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల కోపరేటివ్ యూనియన్‌కు అప్పగిస్తూ.. 1978 జులై 17 జారీచేసిన జీవోను ఉపసంహరించుకునే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. సంగం డెయిరీని స్వాధీనం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 27వ తేదీన ఇచ్చిన జీవో 19 అమలును నిలుపుదల చేసి, డెయిరీ యాజమాన్య బాధ్యతలను సంగం మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ కలిగి ఉండొచ్చని హైకోర్టు సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.