ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనాతో తగ్గిన ఆదాయం.. రాష్ట్ర ప్రభుత్వంపై రుణభారం..! - ap state debits problems due to lockdown

లాక్​డౌన్ నుంచి ఉపశమనం కలిగిస్తూ కేంద్రం దశలవారీగా అన్​లాక్ ప్రకటనలు చేసినా ఆదాయ పరిస్థితులు మెరుగుపడటం లేదు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్​లో ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. కరోనా వల్ల పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు ఇంకా పూర్తిస్థాయిలో తెరుచుకోకపోవడంతో ఆదాయపరంగా తీవ్రనష్టం వాటిల్లుతోంది. గడిచిన నాలుగు నెలల్లో రాష్ట్రానికి రూ.10 వేల కోట్లు నష్టం వాటిల్లిందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. నెలనెలకూ రుణభారం కూడా పెరిగిపోతోంది.

కరోనాతో తగ్గిన ఆదాయం.. రాష్ట్ర ప్రభుత్వంపై రుణభారం..!
కరోనాతో తగ్గిన ఆదాయం.. రాష్ట్ర ప్రభుత్వంపై రుణభారం..!

By

Published : Aug 5, 2020, 2:02 AM IST

కరోనాతో తగ్గిన రాష్ట్ర ఆదాయం

కరోనా కారణంగా పెరిగిన ఖర్చులు, ఆదాయ లేమి, రుణభారం రాష్ట్రాన్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. లాక్​డౌన్ నుంచి ఉపశమనం కల్పిస్తూ కేంద్రం చర్యలు చేపట్టినా.. రాష్ట్ర ఆదాయం పుంజుకోలేదు. కరోనా కాలానికి సంబంధించి నాలుగు నెలల పాటు రాష్ట్ర ఆదాయంలోనూ దాదాపు 10 వేల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని ఆర్థికశాఖ అంచనా వేస్తోంది.

కరోనా కారణంగా లాక్​డౌన్​తో ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్ర ఆదాయంలో 20 శాతం కూడా వసూలు కాలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అన్​లాక్ చర్యల కారణంగా జూన్, జులై నెలల్లో పరిస్థితుల్లో కాస్త మార్పు వచ్చినా... అదీ అంత ఆశాజనకంగా లేదని ఆర్థికశాఖ చెబుతోంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం సమకూరిన రాష్ట్ర రెవెన్యూ..... 10 వేల కోట్ల రూపాయల మేర తక్కువ ఉన్నట్టు అధికారులు అంటున్నారు.

రుణాలపైనే..!

కరోనా కారణంగా ఆదాయపరంగా నష్టపోయిన రాష్ట్రాలకు... కేంద్రం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు, ఎఫ్​ఆర్​ఎంబీ పరిమితిలో మార్పులు చేసింది. కరోనా కారణంగా తలెత్తుతున్న ఖర్చులు, సంక్షేమ పథకాల అమలు, ఇతర అవసరాల రీత్యా... రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తీవ్రస్థాయిలో రుణాలపై ఆధారపడుతోంది. జూన్ నెలాఖరు వరకూ రూ.15 వేల కోట్ల మేర సెక్యూరిటీల వేలం రూపంలో పొందిన ప్రభుత్వం.... జులై నెలలో మరో 6 వేల కోట్ల రూపాయల మేర సెక్యూరిటీలను విక్రయించింది.

ఆగస్టు, సెప్టెంబరు నెలలకుగానూ మరో 14 వేల కోట్ల రుణాలను తీసుకునేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించినట్టు తెలుస్తోంది. జులై నెలలో 4 వేల కోట్ల రూపాయల మేర రుణం తీసుకోవటంతో.... ప్రస్తుతం రాష్ట్ర అప్పులు... కొత్తగా 19 వేల కోట్ల రూపాయలు పెరిగాయి. ఆగస్టు నెల మొదట్లోనే రిజర్వు బ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో మరో 2 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం సమీకరించింది. మొత్తం రుణాలు 21 వేల కోట్లకు పెరిగాయి.

ఇదీ చూడండి..

అమరావతే మా రాజధాని.. న్యాయస్థానాలే మాకు దిక్కు

ABOUT THE AUTHOR

...view details