స్థానిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎన్నికల సంఘం ఎలాంటి షెడ్యూల్ ను ప్రకటించలేదని తెలియజేసింది. అలా ప్రచారం చేయడం ఉద్దేశపూర్వకం, కుట్రపూరితమని ఎస్ఈసీ వ్యాఖ్యానించింది. తప్పుడు సమాచారం ప్రచారం చేయడంలో భాగంగానే ఇది జరుగుతోందని భావిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని పేర్కొంది.
ఆ ప్రచారంలో వాస్తవం లేదు: రాష్ట్ర ఎన్నికల సంఘం - ఏపీ ఎన్నికల సంఘం
స్థానిక ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసిందంటూ వచ్చిన వార్తలను ఎస్ఈసీ ఖండించింది. ఎలాంటి షెడ్యూల్ను ప్రకటించలేదని స్పష్టం చేసింది.
ap state election commission