ముగిసిన కేబినెట్ సమావేశం.. ఆర్గానిక్ ఫార్మింగ్ సర్టిఫికేషన్ అథారిటీకి ఆమోదం.. - ఏపీ కేబినెట్ 2021
11:19 September 16
మంత్రివర్గ సమావేశం..
ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆర్గానిక్ ఫార్మింగ్ సర్టిఫికేషన్ అథారిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఈ తరహా అథారిటీలు 12 రాష్ట్రాల్లో పనిచేస్తున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఆర్గానిక్ ఫాంగా గుర్తించిన సంస్థలు మాత్రమే ఉత్పత్తులు విక్రయించేలా కొత్త విధానం తీసుకురానున్నారు. ఇక ఆసరా పథకంలో భాగంగా రెండో విడత మొత్తాన్ని విడుదల చేసేందుకు కూడా మంత్రివర్గం ఆమోదాన్ని తెలియజేసింది.
మరోవైపు గృహ నిర్మాణ పథకాల్లో లబ్దిదారులకు అదనంగా 35 వేల రూపాయల రుణాన్ని ఇచ్చే అంశాన్ని కూడా మంత్రివర్గంలో చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నాడు-నేడు పథకం కింద పాఠశాలలు, ఆస్పత్రులను పునర్నిర్మించేందుకు ఆర్ధిక సహకారాన్ని అందించే దాతల పేర్లను వాటికి పెట్టేందుకు వీలుగా కొత్త విధానాన్ని తీసుకువచ్చే ప్రతిపాదనపైనా కేబినెట్ చర్చించింది. విశాఖ మన్యంలో ఏకలవ్య పాఠశాల ఏర్పాటు ప్రతిపాదనపై కూడా ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా బద్వేలు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపైనా చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: