ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పది ఫలితాల విడుదలకు.. ముహూర్తం ఖరారు - apssc results

AP SSC Results Tomorrow: పదో తరగతి పరీక్ష ఫలితాలకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేస్తారని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డి.దేవానందరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.

SSC Results Tomorrow
SSC Results Tomorrow

By

Published : Jun 5, 2022, 4:05 PM IST

AP SSC Results: రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు రేపు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానున్నాయి. విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్‌లో ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించనున్నారు. నిజానికి శనివారం ఉదయం 11 గంటలకు టెన్త్ ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది. కానీ.. అనివార్య కారణాల వల్ల ఫలితాల విడుదల సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ఆఖరి నిమిషంలో అధికారులు ప్రకటించారు. దీంతో.. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో.. అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత www.results.bse.ap.gov.in అధికారిక వెబ్‌సైట్‌ నుంచి విద్యార్థులు ఫలితాలను చూసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

వాయిదాకు అదే కారణమా?: శనివారం ఉదయం 11 గంటలకు పదో తరగతి ఫలితాలను విజయవాడలో పాఠశాల విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ విడుదల చేస్తారంటూ రెండు రోజుల ముందే విద్యాశాఖ ప్రకటించింది. ఆ సమయానికి పరీక్షలు రాసిన ఆరు లక్షల 20 వేల మందికిపైగా విద్యార్ధులు, వారి కుటుంబ సభ్యులు అంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూశారు. మీడియా ప్రతినిధులు ఫలితాల కోసం విజయవాడలోని ఆర్​అండ్​బీ కార్యాలయానికి వెళ్లినప్పటికీ.. ప్రభుత్వం ముందుగా చెప్పిన సమయానికి సంబంధిత అధికారులు ఎవరూ ఆ ప్రాంతానికి రాలేదు. 20 నిమిషాల తర్వాత ఫలితాల విడుదలను అనివార్య కారణాల వల్ల సోమవారానికి వాయిదా వేశామనే సందేశాన్ని పంపించారు.

మంత్రి, అధికారుల మధ్య అంతరమే ఈ వాయిదాకు కారణమనే ప్రచారం సాగింది. అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ రాష్ట్రంలో ప్రభుత్వ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ మంత్రి ద్వారానే ప్రకటింపజేయడం ఆనవాయితీగా వస్తోంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత తొలిసారిగా విద్యాశాఖ బాధ్యతలు తీసుకున్న బొత్స సత్యనారాయణ చేతుల మీదుగానే ఫలితాలు ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని సీఎంవో నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. కరోనా వల్ల గత రెండేళ్లు విద్యార్ధులను పరీక్షలు లేకుండా ఉత్తీర్ణులు చేశారు. ఈ ఏడాది విద్యార్థులు ప్రత్యక్షంగా పరీక్షలు రాశారు.

ఏప్రిల్‌ 27 నుంచి మే 9 వరకు పరీక్షలు నిర్వహించారు. మే 13 నుంచి ప్రశ్నపత్రాల మూల్యాంకనం చేపట్టారు. రెండేళ్ల తర్వాత మొదటిసారిగా పదో తరగతి పరీక్షలను ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్వహించింది. 2020, 2021లో కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించలేదు. చాలా సంవత్సరాల తర్వాత మార్కుల రూపంలో ఫలితాలు ప్రకటిస్తున్నారు. దీంతో.. ఈసారి ఉత్తీర్ణత శాతం ఎలా ఉంటుందనే అంశంపై విద్యార్థులు, తల్లిదండ్రులల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా.. ర్యాంకుల ప్రచారంపై ప్రభుత్వం నిషేధం విధించింది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details