పెండింగ్లో ఉన్న డీఏలపై ప్రభుత్వం ప్రకటన విడుదల చేసిందని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం మూడు డీఏలు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ఈ మూడింట్లో మొదటి విడతగా జనవరి 2021, రెండో విడత జూలైలో, మూడో విడత డీఏను జనవరి 2022లో చెల్లించేలా ప్రభుత్వం పేర్కొందని ఆయన చెప్పారు.
కరోనా కారణంగా వాయిదా వేసిన మార్చి, ఏప్రిల్ నెల సగం జీతాలను ఐదు విడతల్లో చెల్లిస్తుందని వివరించారు. మొదటి విడతను ఈ నవంబర్ నెల జీతంతో నగదుగా చెల్లిస్తారని వెల్లడించారు.