ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు తనకు సమయం లేదని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు షెడ్యూల్ జారీ చేయలేని పరిస్థితిలో ఉన్నానని ఉత్తర్వులు జారీ చేశారు. 4 వారాలు ఎన్నికల కోడ్ విధించాలన్న బాధ్యతనూ నెరవేర్చలేనని పేర్కొన్నారు. ప్రస్తుతం సిబ్బంది కరోనా టీకా వేయించుకోవడంలో నిమగ్నమయ్యరని ఎస్‌ఈసీ తెలిపారు. ఈ సమయంలో షెడ్యూల్ జారీ చేయలేనని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. నూతన ఎస్‌ఈసీ భుజస్కంధాలపైనే బాధ్యతలన్నీ ఉంటాయని నిమ్మగడ్డ తెలిపారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ జారీ చేయలేం: ఎస్ఈసీ - ap sec latest news
![ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ జారీ చేయలేం: ఎస్ఈసీ ap sec](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11136902-160-11136902-1616570578694.jpg)
ap sec
12:21 March 24
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సమయం లేదన్న ఎస్ఈసీ
మరోవైపు రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిలిచిపోయిన దగ్గర్నుంచే నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని(ఎస్‌ఈసీ), ఎన్నికల కమిషనర్‌ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి
Last Updated : Mar 24, 2021, 12:58 PM IST