పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించడమే లక్ష్యంగా.. ఇప్పటికే ఈ నెల 29,30 తేదీల్లో అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పర్యటించిన ఎస్ఈసీ.. నేటి నుంచి మిగిలిన జిల్లాలకూ వెళ్లనున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర శాఖల అధికారులతో సమీక్షించనున్నారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. తొలుత శ్రీకాకుళం జిల్లాకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు విజయవాడ నుంచి విశాఖ బయల్దేరనున్న నిమ్మగడ్డ... రెండున్నరకు అక్కడ్నుంచి శ్రీకాకుళం వెళ్తారు. సాయంత్రం నాలుగున్నరకు జిల్లా అధికారులతో సమీక్షిస్తారు. 5 గంటల 45 నిమిషాలకు.. విజయనగరం బయల్దేరి.... రాత్రి 7 గంటలకు అక్కడి జిల్లా అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం రాత్రి ఎనిమిదన్నర గంటలకు విశాఖ బయల్దేరి... రాత్రికి అక్కడే బస చేస్తారు.
రేపటి షెడ్యూల్...
ఫిబ్రవరి 2 ఉదయం 9 గంటలకు.. విశాఖ జిల్లా అధికారులతో సమీక్షించి పదిన్నరకు ఎస్ఈసీ.. కాకినాడ బయల్దేరనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు తూర్పుగోదావరి జిల్లా అధికారులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 3గంటలకు కాకినాడ నుంచి ఏలూరు బయల్దేరి.... రాత్రి 7 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా అధికారులతో సమీక్షిస్తారు. ఫిబ్రవరి 2 రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ఏలూరు నుంచి విజయవాడ బయల్దేరతారు. 3,4 తేదీల్లో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు.