రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం అనంతరం నీలం సాహ్ని మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గతంలోనే అభ్యర్థుల జాబితా పూర్తయిందని, ఎన్నికలు ఆపేందుకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదన్నారు.
ఎన్నికలు ఆపేందుకు కారణాలు కనిపించట్లేదు: ఎస్‌ఈసీ - ap local body elections 2021
ఏపీ ఎస్ఈసీ
12:14 April 02
గతంలోనే అభ్యర్థుల జాబితా పూర్తయింది: ఎస్ఈసీ
'ఎన్నికలు ఆపేందుకు కారణాలు కనిపించట్లేదు. పరిషత్ ఎన్నికల నిర్వహణ ఇప్పటికే ఆలస్యమైంది. ఈనెల 6 వరకు అభ్యర్థులు ప్రచారం చేసుకోవచ్చు. సమావేశానికి ప్రతిపక్షాలు ఎందుకు రాలేదో తెలియదు'- ఎస్‌ఈసీ నీలం సాహ్ని
ఇదీ చదవండి
Last Updated : Apr 2, 2021, 12:31 PM IST