రాష్ట్ర సమాచార పౌర సంబంధాల కమిషనర్‌కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మెమో జారీ చేశారు. ఏకగ్రీవ ఎన్నికలపై పత్రికల్లో ప్రకటనల జారీచేసినందుకు వివరణ ఇవ్వాలని మెమో ఇచ్చారు. ఏకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహించే ప్రకటనలపై రాజకీయ పార్టీల నుంచి ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు అందాయని ఎస్ఈసీ తెలిపారు. బలవంతంగా ఏకగ్రీవాలు జరగకుండా నిరోధించేందుకు సమర్థవంతంగా చర్యలు తీసుకోవాలని కోరాయని తెలిపారు.
రాష్ట్ర సమాచార పౌర సంబంధాల కమిషనర్‌కు ఎస్ఈసీ మెమో - సమాచార పౌరసంబంధాల కమిషనర్‌కు ఎస్ఈసీ మెమో
20:14 January 27
ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై వివరణ ఇవ్వాలని ఆదేశం
ప్రకటనల జారీకి రాష్ట్ర ప్రభుత్వం లేదా సంబంధిత ఏజెన్సీలు కమిషన్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉండగా..... ఎన్నికల కమిషన్‌ను సంప్రదించకుండానే పత్రికల్లో ప్రకటనలు జారీ చేశారని మెమోలో తెలిపారు. ఇలాంటి ప్రకటనలు గ్రామ పంచాయతీ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని ఎస్ఈసీ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రకటనలు ఇవ్వకుండా ఉండాలని సమాచార శాఖను కమిషన్ ఆదేశించారు. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల అధికారి ఎన్నికల నియమావళిని ఉల్లఘించారని... దీనిపై వెంటనే ఎస్ఈసీకి వివరణ ఇవ్వాలన్నారు.
ఇదీ చదవండి