ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాత్రి 8 గంటల్లోగా అన్ని ఫలితాలు ప్రకటించేలా చూడాలి: ఎస్ఈసీ - ap sec nimmagadda ramesh kumar

రాత్రి 8 గంటల్లోగా అన్ని ఫలితాలు ప్రకటించేలా చూడాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలిచ్చారు. ఈమేరకు కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అదనపు మార్గదర్శకాలు జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని ఎన్నికల అధికారులకు సూచించారు.

ap sec
ap sec

By

Published : Mar 13, 2021, 8:02 PM IST

Updated : Mar 14, 2021, 6:41 AM IST

కార్పొరేషన్లు, మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను మరీ ఆలస్యం కాకుండా చూడాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశించారు. రాత్రి 8 గంటల్లోగా అన్ని ఫలితాలనూ ప్రకటించేలా చూడాలని ఎస్ఈసీ స్పష్టం చేశారు. ఈమేరకు కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అదనపు మార్గదర్శకాలు జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని ఎన్నికల అధికారులకు సూచించారు. ప్రత్యామ్నాయంగా జనరేటర్లు, ఇన్వర్టర్లను కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియను వెబ్ క్యాస్టింగ్, వీడియోగ్రఫీ లేదా సీసీ కెమెరాల ద్వారా చిత్రీకరించాలని.. కౌంటింగ్ ప్రక్రియ ఫుటేజీని ఎన్నికల రికార్డుగా భద్రపరచాల్సిందిగా సూచించారు.

రాత్రి 8 గంటల కల్లా కౌంటింగ్ ప్రక్రియను ముగించేలా చూడాలని ఎస్ఈసీ స్పష్టం చేశారు. మరీ ఆలస్యం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా కౌంటింగ్ జరిగేలా చూడాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలిచ్చారు. 10 కంటే తక్కువ మెజారిటీ ఉన్న సమయంలో మాత్రమే నిబంధనలు, మార్గదర్శకాల మేరకే రీకౌంటింగ్ కు అనుమతించాలని సూచించారు. రెండంకెల మెజారిటీ వచ్చిన చోట అభ్యర్ధి చేసిన విజ్ఞప్తి మేరకు జిల్లా కలెక్టర్ కు నివేదించి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఎన్నికల ఫలితాల ప్రకటన సమాచారం ప్రజల్లోకి వెళ్లేలా వివరాలు అందించేందుకు మీడియా కోసం ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు.

Last Updated : Mar 14, 2021, 6:41 AM IST

ABOUT THE AUTHOR

...view details