పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏర్పాటు చేసిన సమావేశానికి పంచాయతీరాజ్ అధికారులు గైర్హాజరయ్యారు. సమావేశానికి రావాలంటూ పంచాయతీ రాజ్ ఉన్నతాధికారికి ఎస్ఈసీ మెమో జారీ చేసినా స్పందన కరవైంది.
ఎస్ఈసీతో సమావేశానికి పంచాయతీరాజ్ అధికారుల గైర్హాజరు
16:12 January 22
ఎస్ఈసీ తదుపరి కార్యాచరణపై ఉత్కంఠ
అసలేం జరిగిందంటే...?
శుక్రవారం ఉదయం 10 గంటలకు పంచాయతీరాజ్ కీలక అధికారులతో భేటీ ఏర్పాటు చేయాలని భావించారు ఎస్ఈసీ. అయితే ముఖ్యమంత్రితో సమావేశం ఉందని అధికారులు చెప్పటంతో మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. అయినప్పటికీ సమావేశానికి పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు హాజరు కాలేదు. వారి తీరుపై ఆగ్రహించిన రమేశ్ కుమార్... పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్‌కు మెమో జారీ చేశారు. సాయంత్రం 5 గంటలకు నిర్వహించే భేటీకి తప్పక హాజరుకావాలని అందులో స్పష్టం చేశారు. అయినప్పటికీ సాయంత్రం 5 దాటినా అమరావతిలోని ఎన్నికల కమిషన్ కార్యాలయానికి అధికారులు చేరుకోలేదు. ఈ క్రమంలో ఎస్ఈసీ తదుపరి కార్యాచరణపై ఉత్కంఠ నెలకొంది.
ఇదీ చదవండి
పంచాయతీ ఎన్నికలు: తొలిదశ నోటిఫికేషన్ విడుదలకు ఎస్ఈసీ సమాయత్తం