రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనుదారులలో కొద్దిమందికే సోమవారం జులై నెల జీతాలు, పింఛన్లు జమయ్యాయి. ప్రతినెలా ఒకటో తారీకున రావాల్సిన జీతాలు ఇటీవలి నెలల్లో బాగా ఆలస్యమవుతుండటంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్‌జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు కూడా ఇటీవల మాట్లాడుతూ జీతాలు సమయానికి రావడం లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ జీతాలు, పింఛన్లు అందేసరికి మరో వారం రోజులు పట్టవచ్చని ఆర్థికశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. చాలామందికి పింఛన్లు అందలేదని పెన్షనర్ల చర్చా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఈదర వీరయ్య తెలిపారు. ప్రతి నెలా జీతాలు, పింఛన్ల కోసం దాదాపు రూ.5,500 కోట్ల వరకు అవసరమవుతాయి. సోమవారం రూ. 2000 కోట్లలోపు చెల్లించామని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతుండగా... ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు మాత్రం రూ.3500 కోట్లు చెల్లించినట్లు చెబుతున్నాయి.
సామాజిక పింఛన్లలోనూ ఇబ్బందులు..