ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో అంచనాలు అందుకోని రెవెన్యూ వసూళ్లు..! - ap revenue income details news

రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ వసూళ్ల అంచనాలు చేరుకోవడం కష్టంగా కనిపిస్తోంది. ఆర్థిక శాఖ అధికారులు బడ్డెట్​లో రూపొందించిన లెక్కలతో పోలిస్తే దాదాపు రూ.21 వేల కోట్లు తక్కువ ఆదాయం వస్తుంది. గతేడాది కంటే 3 శాతం తక్కువ రెవెన్యూ వసూళ్లు ఉంటాయని తెలుస్తోంది.

రాష్ట్రంలో రెవెన్యూ వసూళ్లు అంచనాలకు చేరేనా...?

By

Published : Nov 24, 2019, 5:15 AM IST

Updated : Nov 24, 2019, 7:09 AM IST

రాష్ట్రంలో అంచనాకు తగ్గిన రెవెన్యూ వసూళ్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో రెవెన్యూ వసూళ్లు... అంచనాలను చేరుకోవడం కష్టమేనని అనిపిస్తోంది. ఆర్థిక శాఖ అధికారులు తాజాగా రూపొందించిన గణాంకాలు పరిశీలిస్తే ఇది నిజమేనని అనిపిస్తోంది. 2019 -20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రూపొందించుకున్న లెక్కలతో పోలిస్తే... దాదాపు 21 వేల కోట్లు తక్కువ ఆదాయం వస్తుందని తెలుస్తోంది. ఈ ఏడాది నవంబర్‌ 14 వరకు రాష్ట్రానికి వివిధ రూపాల్లో 98 వేల 458 కోట్లు రెవెన్యూ ఆదాయం వచ్చినట్లు అధికారులు లెక్కించారు. నవంబర్‌ 14 తర్వాత నుంచి ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అంటే ...మార్చి 31 నాటికి 59 వేల 348 కోట్ల ఆదాయం రావచ్చని అంచనాలు రూపొందించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం లక్షా 57 వేల 806 కోట్ల ఆదాయం సాధ్యమని చెబుతున్నారు. నిజానికి తొలి రోజుల్లో లక్షా 78 వేల కోట్లు రెవెన్యూ సముపార్జించగలమని అంచనా వేశారు. ఇప్పుడు ఆస్థాయికి చేరడం అంత సులభం కాదని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. గతేడాదితో పోలిస్తే 3 శాతం రెవెన్యూ ఆదాయాలు తక్కువగా ఉంటాయని తెలుస్తోంది.

2019-20 ఆర్థిక సంవత్సరంలో నవంబరు 14 వరకూ వచ్చిన వసూళ్లు.. రాబోయే ఆదాయంపై అంచనాలు ఇలా ఉన్నాయి.

అంశం వచ్చిన ఆదాయం(అంకెలన్నీ కోట్లలో) రాబోయే రోజుల్లో వస్తుందన్న అంచనా(అంకెలన్నీ కోట్లలో)
రాష్ట్ర సొంత ఆదాయం 35,130 22,253
కేంద్ర పన్నుల్లో వాటాలు 15,795 19,061
కేంద్ర గ్రాంట్లు 3,326 4,559
కేంద్ర ప్రాయోజిత పథకాలు 6,652 4,244
ఇచ్చిన రుణాలు వసూళ్లు 43 28
రుణాలు రూపేణా 29,432 10,447
ప్రజాపద్దు 8,071 -1,244
మొత్తం ఆదాయం 98,458 59,348
Last Updated : Nov 24, 2019, 7:09 AM IST

ABOUT THE AUTHOR

...view details