VACCINE RECORD: ఒక్కరోజే 11.85 లక్షల మందికి టీకాలు - AP News
16:23 June 20
AK Singhal: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా టీకాలు: ఆరోగ్యశాఖ కార్యదర్శి
కొవిడ్ వ్యాక్సినేషన్‌లో రాష్ట్రం రికార్డు సృష్టించింది. ఇవాళ ఒక్కరోజే 11.85 లక్షల మందికి టీకాలు వేశారు. ఒకేరోజు 6 లక్షల మందికి టీకాలు ఇచ్చిన గత రికార్డును ఏపీ అధిగమించింది. వీలైనంత ఎక్కువ మందికి టీకాలు వేసే సామర్ధ్యం తమకు ఉందని కేంద్రానికి నివేదిక పంపడానికి స్పెషల్ డ్రైవ్ ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టినట్టు... వైద్యారోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. దీని ద్వారా కేంద్రాన్ని మరిన్ని ఎక్కువ డోసులు రాష్ట్రానికి ఇవ్వాలని అడగొచ్చని వివరించారు.
ఇదీ చదవండీ... VACCINE DRIVE: 'కేంద్రానికి మన సామర్ధ్యం తెలిపేలా.. స్పెషల్ డ్రైవ్'