ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రయివేట్ కళాశాలల నిర్వాహకం.. డీసెట్‌ అర్హత లేకుండానే ప్రవేశాలు! - admissions without deecet qualification in ap

రాష్ట్రంలో కొన్ని ప్రైవేటు డీఈడీ కళాశాలల యాజమాన్యాల అత్యాశకు 25 వేల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. 2018-2020 బ్యాచ్‌కు సంబంధించి అనుమతి లేకుండానే ప్రవేశాలు కల్పించాయి. ఫలితంగా.. రెండేళ్లపాటు చదివిన చదువు ఎందుకూ పనికి రాకుండా పోయింది.

ap-private-colleges
ap-private-colleges

By

Published : Sep 14, 2020, 9:24 AM IST

రాష్ట్రంలో కొన్ని ప్రైవేటు డీఈడీ కళాశాలల యాజమాన్యాల అత్యాశ.. 25 వేల మంది విద్యార్థుల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చింది. 2018-2020 బ్యాచ్‌కు సంబంధించి అనుమతి లేకుండానే ప్రవేశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తును అవి నాశనం చేశాయి. ఫలితంగా.. రెండేళ్లపాటు చదివిన చదువు ఎందుకూ పనికి రాకుండా పోయింది. డీసెట్‌లో అర్హత సాధించని వారికి అసలు కౌన్సెలింగ్‌తో సంబంధం లేకుండా విద్యా సంస్థలు ప్రవేశాలు కల్పించాయి. ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిసినా విద్యార్థులకు మాయ మాటలు చెప్పి ఇప్పుడు వారిని రోడ్డున పడేశాయి. ఈ బ్యాచ్‌ వారికి మొదటి ఏడాది పరీక్షలు ఈ నెల 28 నుంచి నిర్వహించనున్నారు. డీసెట్‌లో అర్హత సాధించని విద్యార్థులను పరీక్షలకు అనర్హులుగా ప్రకటించారు.

ఇదీ పరిస్థితి..

పాఠశాల విద్యాశాఖ 2015లో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం డీఈడీలో ప్రవేశాలకు డీసెట్‌లో తప్పనిసరిగా అర్హత సాధించాలి. కానీ దీనిని ఉల్లంఘిస్తూ గత కొన్నేళ్లుగా కళాశాలలు ప్రవేశాలను చేపడుతున్నాయి. సీట్లు భర్తీ కావడం లేదనే ఉద్దేశంతో ప్రభుత్వం దీనికి ప్రత్యేకంగా అనుమతిస్తూ విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అవకాశం ఇచ్చేది. ఈసారి పాఠశాల విద్యాశాఖ అవకాశం ఇవ్వలేదు. దీనిపై యాజమాన్యాలు హైకోర్టుకు వెళ్లగా ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం వీరి ప్రవేశాలు చెల్లవని తీర్పు చెప్పింది. దీనిపై యాజమాన్యాలు మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.

ఇదీ చదవండి:

'అంతర్వేది' విధుల్లో ఉన్న పోలీసులకు కరోనా

ABOUT THE AUTHOR

...view details