ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆపదలో ఉన్న మహిళలకు ఇకపై సత్వర న్యాయం

లాక్​డౌన్ వేళ మహిళలపై గృహహింస పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బాధిత మహిళలకు సత్వర సాయం అందించేందుకు పోలీసుశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అన్ని జిల్లాల్లో 24 గంటలూ పనిచేసే వన్‌స్టాప్ సెంటర్లు ఏర్పాటు చేసింది.

ap police taking special actions for decrease Domestic violence
ap police taking special actions for decrease Domestic violence

By

Published : Apr 21, 2020, 8:42 PM IST

లాక్‌డౌన్‌లో గృహహింస ఎదుర్కొంటున్న మహిళల రక్షణకు ఏపీ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అన్ని జిల్లాల్లో 24 గంటలూ పనిచేసే వన్‌స్టాప్ సెంటర్లు ఏర్పాటు చేశారు. నిపుణులతో వైద్య, ఆరోగ్య, మానసిక, సాంఘిక, న్యాయ సాయం అందించనున్నారు. పోలీసు సంరక్షణ, వసతి సౌకర్యం 24 గంటలూ అందుబాటులో ఉంచుతున్నారు. రాష్ట్రంలోని 23 స్వధార్ గృహాల్లో బాధిత మహిళలకు వసతి, రక్షణ సౌకర్యాలు కల్పించనున్నారు. ఉమెన్ హెల్ప్‌లైన్ 181 నిరంతరాయంగా అందుబాటులో ఉండనుంది. వీటితో పాటు జిల్లాల్లో తక్షణ సహాయం కోసం కాల్ చేయాల్సిన నంబర్లను విడుదల చేశారు.

జిల్లా కాల్​ చేయాల్సిన నంబర్లు
శ్రీకాకుళం 9110793708
విశాఖపట్నం 6281641040
పశ్చిమ గోదావరి 9701811846
గంటూరు 9963190234
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు 9848653821
కర్నూలు 9701052497
అనంతపురం 8008053408
విజయనగరం 8501914624
తూర్పుగోదావరి 9603231497
కృష్ణా 9100079676
ప్రకాశం 9490333797
చిత్తూరు 9959776697
వైయస్​ఆర్ కడప 8897723899

ABOUT THE AUTHOR

...view details