నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఉత్తమ ప్రతిభ కనపర్చిన పోలీస్ అధికారులకు కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి అంత్రిక్ సురక్ష సేవా పతకాలను ప్రకటించింది. రాష్ట్రానికి చెందిన ఐదుగురు అధికారులు ఈ మెడల్‌ను దక్కించుకున్నారు. టెక్నికల్ డీఐజీ పాలరాజు, అనంతపురం డీఐజీ క్రాంతిరానా టాటా, శాంతి భద్రతల డీఐజీ రాజశేఖర్ బాబు, నెల్లూరు ఎస్పీ భాస్కర్ భూషణ్ , గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీలను కేంద్రం ఎంపిక చేసింది. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ గౌతం సవాంగ్ చేతుల మీదుగా ఈ మెడళ్లను అధికారులు అందుకున్నారు.
కేంద్ర ప్రభుత్వ అవార్డులు అందుకున్న రాష్ట్ర పోలీసు అధికారులు - కేంద్ర ప్రభుత్వ అవార్డులు అందుకున్న ఏపీ రాష్ట్ర పోలీసు అధికారులు
ఉత్తమ ప్రతిభ కనబరచిన పోలీసులకు కేంద్రప్రభుత్వం అంత్రిక్ సురక్ష సేవా పతకాలను ప్రకటించింది. రాష్ట్రానికి చెందిన ఐదుగురు అధికారులు ఈ పతకాలను డీజీపీ గౌతం సవాంగ్ చేతుల మీదుగా అందుకున్నారు.

కేంద్ర ప్రభుత్వ అవార్డులు అందుకున్న రాష్ట్ర పోలీసు అధికారులు