పోలీసులకు ఓ మతాన్ని ఆపాదించటం సరికాదని రాష్ట్ర పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు అన్నారు. ప్రజల రక్షణ కోసం పని చేస్తున్న పోలీసులకు ఓ మతాన్ని ఆపాదిస్తూ కొంతమంది చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. దసరా పండగ రోజు అన్ని పోలీసు స్టేషన్లలో ఆయుధ పూజ చేసుకుంటామన్నారు. రంజాన్ పండుగ రోజున ప్రార్థన చేసుకునేందుకు గంట సమయం ఇస్తారని అన్నారు. అదేవిధంగా ప్రీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారని తెలిపారు. పండుగ రోజుల్లో విధుల్లో ఉండి ప్రజల రక్షణలో తాము పండుగ చేసుకుంటామని అన్నారు.
'పోలీసులకు ఓ మతాన్ని ఆపాదించడం సరికాదు' - పోలీసు స్టేషన్లలో ప్రీ క్రిస్మస్ వేడుకలు
ప్రజల రక్షణ కోసం పనిచేసే పోలీసులకు ఓ మతాన్ని ఆపాదించటం సరికాదని రాష్ట్ర పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు అన్నారు. పోలీసు స్టేషన్లలో దసరా, రంజాన్ పండుగలు నిర్వహిస్తామని అదేవిధంగా ప్రీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటున్నారని తెలిపారు.
Ap police association