ఆంధ్రప్రదేశ్ పోస్టు గ్రాడ్యుయేషన్స్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ పీజీసెట్ )- 2022 నోటిఫికేషన్‌ను యోగివేమన విశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచార్య మునగల సూర్యకళావతి విడుదల చేశారు. యోగివేమన విశ్వవిద్యాలయంలో వైవీయూ ఉపకులపతి, సెట్ ఛైర్మన్ ఆచార్య మునగల సూర్యకళావతి తమ చాంబరులో ఆచార్య విజయరాఘవ ప్రసాద్, ఏపీపీజీ సెట్ స్టేట్ కన్వీనర్ ఆచార్య వై.నజీర్ అహ్మద్‌తో కలసి వైవీయూపీజీసెట్ షెడ్యూలు పత్రాలను విడుదల చేశారు.
ఏపీ పీజీసెట్-2022 నోటిఫికేషన్ విడుదల - ఏపీ పీజీసెట్ 2022 నోటిఫికేషన్ విడుదల
APPGCET Notification: ఏపీపీజీసెట్-2022 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు యోగివేమన వర్సిటీ వీసీ సూర్యకళావతి షెడ్యూలును విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తు జులై 20తో ముగియనుంది. ఆగస్టు 17 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు సూర్యకళావతి స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీజీసెట్ - 2022 నిర్వహణ బాధ్యతను వైఎస్సార్ జిల్లాలో ఉన్న తమ విశ్వవిద్యాలయానికి రెండోదఫా అప్పగించిందని సూర్యకళావతి తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 16 విశ్వవిద్యాలయాలు, అనుబంధ పోస్టుగ్రాడ్యుయేషన్, ప్రైవేటు, అన్ఎయిడెడ్, మైనార్టీ కళాశాలల్లో ఉన్న 145 కోర్సులకు ఒకే నోటిఫికేషన్ (ఏపీపీజీసెట్-22) ద్వారా సీట్లు భర్తీ అవుతాయన్నారు. ఆన్లైన్ దరఖాస్తుకు జులై 20వ తేదీ వరకు గడువు ఉన్నట్లు తెలిపారు. రూ.500 ఆలస్య రుసుంతో జులై 27వ తేదీ వరకు... అలానే రూ.1000 ఆలస్య రుసుంతో జులై 29వ తేదీ వరకు గడువు ఉందన్నారు. దరఖాస్తు రుసుం ఓసీ అభ్యర్థులకు రూ.850, బీసీ అభ్యర్థులకు రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.650 చెల్లించాల్సి ఉంటుందన్నారు. డిగ్రీ చివరి సెమిస్టరులో ఉన్నవారు సైతం ఏపీపీజీసెట్-2022 రాసేందుకు అర్హులుగా పేర్కొన్నారు. పరీక్షలు ఆగస్టు 17వ తేదీ నుంచి ఆన్లైన్ విధానంలో కంప్యూటరు ఆధారిత టెస్ట్ (సీబీటీ) రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల సౌకర్యార్థం హైదరాబాద్‌లో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు ఆన్లైన్ దరఖాస్తు, వివరాల కోసం www.yvu.edu.in (లేదా) https://cets.apsche.ap.gov.in ను సందర్శించాలని సూచించారు.
- ఆన్లైన్ దరఖాస్తుకు గడువు - జులై 20
- రూ.500 ఆలస్య రుసుంతో గడువు - జులై 27
- రూ.1000 ఆలస్య రుసుంతో గడువు - జులై 29
- దరఖాస్తు రుసుం - ఓసీ అభ్యర్థులకు రూ.850, బీసీ అభ్యర్థులకు రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.650
ఇదీ చదవండి: