ఆంగ్లమాధ్యమం అంశంలో రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే ధర్మాసనం విచారణ చేపట్టనుంది. గత విచారణలో ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ప్రాథమిక విద్య మాతృభాషలోనే బోధించాలని ఇప్పటికే సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలు 81, 85ను హైకోర్టు రద్దు చేయగా.. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ వైకాపా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఆంగ్లమాధ్యమం అంశంలో ఏపీ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ - ఏపీలో ఆంగ్లమాధ్యమం తాజా వార్తలు
ఆంగ్లమాధ్యమం అంశంలో వైకాపా ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం వేసిన వ్యాజ్యంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
ap petition