ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

యూపీ అత్యాచార ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శన - ఏపీ ప్రజల కొవ్వొత్తుల నిరసన తాజా వార్తలు

ఉత్తరప్రదేశ్​లో హాథ్రస్ యువతిపై జరిగిన ఘటన దేశవ్యాప్తంగా ప్రజలను కదిలించింది. ఈ ఘటనలో పాల్గొన్న దోషులను న్యాయస్థానం కఠినంగా శిక్షించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కొవ్వొత్తులతో ప్రదర్శన చేసి తమ నిరసన తెలిపారు.

ap people protest against uttarpradesh hatras girl rape incident
ఉత్తర్​ప్రదేశ్​లోని ఘటనపై రాష్ట్రమంతటా కొవ్వొత్తుల ప్రదర్శన

By

Published : Oct 3, 2020, 9:41 AM IST

మహిళలపై జరుగుతున్న దాడులు, హత్యలను ఖండిస్తూ రాష్ట్రమంతటా కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు.

విశాఖపట్నంలో..

కంచరపాలెం రైతుబజార్​ వద్ద మహిళలంతా నినాదాలు చేస్తూ కొవ్వొత్తులతో ప్రదర్శన తెలిపారు. ఉత్తరప్రదేశ్​లోని హాథ్రస్​లో దళిత యువతపై జరిగిన అత్యాచార ఘటనకు నిరసన తెలిపారు. ఇటువంటి దుండగులకు సహాయం చేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు బొట్టా ఈశ్వరమ్మ, పుష్ప, పద్మ, లక్ష్మీ, రాధ తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి జిల్లాలో..

తునిలో ఐద్వా, ఎస్ఎఫ్ఐ, సీఐటీయూ తదితర సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలో మున్సిపల్​ పార్క్ సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఉత్తర ప్రదేశ్​లో దళిత యువతిపై లైంగిక దాడి చేసిన దోషులను కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని కోరారు. అనంతరం పట్టణ ఎస్సై శ్రీనివాస్​ని కలిసి వినతి పత్రం అందజేశారు.

ప్రకాశం జిల్లాలో..

కనిగిరి పాతూరులో స్నేహ హస్తం, గుడ్ హెల్ప్, లివింగ్ హోప్ ఆధ్వర్యంలో మహిళలు, పిల్లలు కొవొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఉత్తర ప్రదేశ్​లోని హాథ్రస్ ప్రాంతంలో 19 ఏళ్ల యువతిపై అత్యాచారం జరిపి ఆమె మరణానికి కారకులైనన దోషులను... న్యాయస్థానం కఠినంగా శిక్షించాలని కోరారు. యువతి ఆత్మకు శాంతి చేకూరాలని కొవొత్తులతో శ్రద్ధాంజలి ఘటించారు.

కర్నూలు జిల్లాలో..

ఉత్తరప్రదేశ్​లోని హాథ్రస్ యువతిపై అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ ఎమ్మిగనూరులో ఏఐఎస్​ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థినీలు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఏఐఎస్​ఎఫ్​ నాయకులు విజేంద్ర, సీపీఐ నాయకులు భాస్కర్ యాదవ్, సత్యన్న తదితరులు పాల్గొన్నారు.

కడప జిల్లాలో..

ఉత్తరప్రదేశ్​లో యువతిపై జరిగిన అత్యాచార ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ సీపీఎం నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రాజంపేటలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. దేశంలో మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయని.. వాటిని అరికట్టాల్సిన కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీపీఐ నాయకులు ధ్వజమెత్తారు. యువతిపై అత్యాచారం జరిగినా అక్కడి పోలీసు ఉన్నతాధికారులు అలాంటిదేమీ జరగలేదని చెప్పడం దారుణమన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి :

'హాథ్రస్ ఘటనలో నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రభుత్వం విఫలం'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details