ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

''ఎన్టీపీసీతో ఒప్పందం ఉన్నా.. ప్రైవేటు సంస్థల నుంచి కొనుగోళ్లు'' - 'విద్యుత్ కొనుగోళ్లలో తెదేపా ప్రభుత్వం అక్రమాలకు పాల్పడింది'

గత ప్రభుత్వం ప్రైవేటు సంస్థల నుంచి పెద్ద ఎత్తున విద్యుత్ కొనుగోలు చేసిందని మంత్రి  బాలినేని శ్రీనివాసరెడ్డి  మండిపడ్డారు. కర్ణాటకలోని కుడిగి ఎన్టీపీసీ ప్లాంటుతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఉన్నా...ప్రైవేటు సంస్థల నుంచి కొనుగోలు చేసిందని ఆరోపించారు.

'విద్యుత్ కొనుగోళ్లలో గత ప్రభుత్వం అక్రమాలకు పాల్పడింది'

By

Published : Oct 10, 2019, 8:46 PM IST

విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఆరోపణలు గుప్పించారు. కర్ణాటకలోని కుడిగి ఎన్టీపీసీ ప్లాంటుతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఉన్నా... గత ప్రభుత్వం ప్రైవేటు సంస్థల నుంచి పెద్ద ఎత్తున విద్యుత్ కొనుగోలు చేసిందని బాలినేని ఆరోపించారు. యూనిట్ ధర 4.80 రూపాయలకు లభ్యమైనా.. 11.68 రూపాయలకు చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని విమర్శించారు. తద్వారా 317 కోట్ల మేర స్థిరచార్జీలను చెల్లించాల్సి వచ్చిందని ఆక్షేపించారు. ప్రస్తుతం విద్యుత్ ఎక్స్చేంజ్ ద్వారా యూనిట్ ధరను 2.95 నుంచి 3.41 రూపాయలకు కోనుగోలు చేస్తున్నామని మంత్రి వివరించారు. 2018తో పోలిస్తే 2019లో తక్కువ ఛార్జీలకే విద్యుత్ కొనుగోళ్లు చేశామని స్పష్టం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details