ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గ్రామీణ ప్రాంతాల్లోనూ మాస్క్​ తప్పనిసరి.. ఉత్తర్వులు జారీ - ap government orders on masks news

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోనూ మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ పంచాయతీరాజ్​ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు మాస్కు ధరించకుండా బహిరంగ ప్రదేశాలకు వస్తే.. 10 నుంచి 50 రూపాయల వరకూ జరిమానా విధించాలని పేర్కొంది. వీటి అమలు పర్యవేక్షణ పంచాయతీ సిబ్బందితో పాటు గ్రామ సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు కూడా చేపట్టాలని సూచించింది.

గ్రామీణ ప్రాంతాల్లోనూ మాస్క్​ తప్పనిసరి.. ఉత్తర్వులు జారీ
గ్రామీణ ప్రాంతాల్లోనూ మాస్క్​ తప్పనిసరి.. ఉత్తర్వులు జారీ

By

Published : Aug 6, 2020, 1:08 AM IST

Updated : Aug 6, 2020, 1:16 AM IST

రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తృతి నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేయాల్సిందిగా పంచాయతీరాజ్​ శాఖ ఆదేశాలు జారీ చేసింది. మాస్క్​ ధరించకుంటే జరిమానా విధించాలని సర్క్యులర్​ ఇచ్చింది. జిల్లా పరిషత్​లు దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేసింది. జిల్లాలు, మండలాలు, పంచాయతీల్లో మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేసేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని పంచాయతీరాజ్​ శాఖ స్పష్టం చేసింది.

ప్రజలు మాస్కులు ధరించకుండా బయటకు వస్తే.. 10 నుంచి 50 రూపాయల మేర జరిమానా విధించాలని పంచాయతీరాజ్​ శాఖ ఆదేశాలిచ్చింది. వీటి అమలు పర్యవేక్షణ పంచాయతీ సిబ్బందితో పాటు గ్రామ సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు కూడా చేపట్టాలని సూచించింది. ఇలా వసూలు చేసిన జరిమానా మొత్తాలను కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలకే ఖర్చు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Last Updated : Aug 6, 2020, 1:16 AM IST

ABOUT THE AUTHOR

...view details