ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పంచాయతీ పోరు: తొలివిడతలో 80.66 శాతం పోలింగ్ నమోదు - ap panchayath elections polling

ap panchayathi elections
ఏపీ పంచాయతీ ఎన్నికలు

By

Published : Feb 9, 2021, 6:19 AM IST

Updated : Feb 9, 2021, 6:40 PM IST

18:35 February 09

తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో 81.66 శాతం పోలింగ్ నమోదైంది. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 85.06 శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 77.04 శాతం పోలింగ్ నమోదైంది.

జిల్లా పోలింగ్ శాతం
శ్రీకాకుళం 77.04
విశాఖ  82.86
తూర్పుగోదావరి  82.80
పశ్చిమ గోదావరి 80.29
కృష్ణా 85.06
గుంటూరు 83.04
ప్రకాశం 80.89
నెల్లూరు 80.62
కర్నూలు 83.55
అనంతపురం 82.30
కడప 78
చిత్తూరు 83.47

16:32 February 09

తెదేపా నాయకుడిపై గొడ్డలితో దాడి..

  • కృష్ణా: జగ్గయ్యపేట మం. వేదాద్రిలో తెదేపా నాయకుడిపై దాడి
  • తెదేపా నాయకుడిపై గొడ్డలితో దాడి చేసిన దుండగులు
  • వేదాద్రి 7వ వార్డు అభ్యర్థి భర్త రాంబాబుపై గొడ్డలితో దాడి
  • రాంబాబుకు తీవ్రగాయాలు, జగ్గయ్యపేట ఆస్పత్రికి తరలింపు

15:39 February 09

3.30 గం.కు వరుసలో ఉన్నవారికి ఓటేసే అవకాశం..

  • 3.30 గం.కు వరుసలో ఉన్నవారికి ఓటేసే అవకాశం: గిరిజా శంకర్‌
  • తొలిదశ పోలింగ్‌లో ఎక్కడా అవాంతరాలు ఎదురుకాలేదు: గిరిజా శంకర్‌
  • ఫలితాలు వచ్చాక ఉపసర్పంచి ఎన్నిక: గిరిజా శంకర్‌
  • ఉపసర్పంచి ఎన్నిక ఇవాళ పూర్తి కాకుంటే రేపు నిర్వహణ: గిరిజా శంకర్‌

15:27 February 09

ముగిసిన తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్

  • 12 జిల్లాల్లో ముగిసిన తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌
  • చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతం
  • కాసేపట్లో పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలు
  • ఫలితాలు వచ్చిన వెంటనే ఉపసర్పంచి ఎన్నిక
  • 2,723 పంచాయతీలు, 20,157 వార్డులకు పోలింగ్‌ పూర్తి
  • 18 రెవెన్యూ డివిజన్లు, 168 మండలాల్లో పోలింగ్‌ పూర్తి

15:10 February 09

పోలింగ్‌ శాతం..

తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్​ కొనసాగుతోంది.  మధ్యాహ్నం 2.30 గంటల వరకు 75.55 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. జిల్లాల వారీగా నమోదైన పోలింగ్ వివరాలివి..

జిల్లా పోలింగ్ శాతం
శ్రీకాకుళం 69
విశాఖ  76.27
తూర్పుగోదావరి  76.55
పశ్చిమ గోదావరి 73.55
కృష్ణా 81
గుంటూరు 76
ప్రకాశం 73.19
నెల్లూరు 76
కర్నూలు 79.51
అనంతపురం 75.78
కడప 71.63
చిత్తూరు 78.06

15:02 February 09

పోలీసుల బందోబస్తు..

కర్నూలు జిల్లాలో తొలిదశ పోలింగ్ ఓటింగ్​ సరళిని వెబ్​కాస్టింగ్​ ద్వారా ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. పోలింగ్​ కేంద్రాల వద్ద యువ ఓటర్లు, వృద్ధుకులు బారులు తీరారు. ఓటింగ్ ప్రక్రియ తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.  

14:56 February 09

ప్రశాంతంగా పోలింగ్​..

గుంటూరు జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా కొనసాగుతోందని.. గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. కర్లపాలెం మండలం ఎంవీ రాజుపాలెంలో జరుగుతున్న పోలింగ్‌ను ఆయన పరిశీలించారు.

14:45 February 09

ఓటర్ల అవస్థలు..

కడప జిల్లాలో  తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్  ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు ఉత్సాహంగా తరలివస్తున్నారు. ప్రొద్దుటూరు మండలం కొత్తపేట పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు అవస్థలు పడుతున్నారు. గంటల తరబడి ఎండలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. అధికారుల పని తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.  

13:34 February 09

చిత్తూరు జిల్లా పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థుల ఆందోళన

చిత్తూరు జిల్లా పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థుల ఆందోళన
  • చిత్తూరు: కమ్మకండ్రిగ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థుల ఆందోళన
  • అధికార పార్టీ మద్దతు అభ్యర్థికి దొంగ ఓట్లు వేస్తున్నారంటూ ఆరోపణలు
  • ఒకే ఓటరును 2, 3 సార్లు పంపిస్తున్నా పోలీసులు పట్టించుకోవట్లేదని ఆందోళన
  • కమ్మకండ్రిగ పంచాయతీలో బయటి వ్యక్తులు ఎందుకు వస్తున్నారంటూ ప్రశ్న
  • అనుమానితులను పోలీసులకు పట్టిస్తున్నా వదిలేస్తున్నారంటూ ఆందోళన

13:31 February 09

ఓటు వేసి వృద్ధురాలు మృతి..

  • శ్రీకాకుళం: ఎల్‌.ఎన్‌.పేట మండలం ఎఫ్‌.డి.పేటకు చెందిన వృద్ధురాలు మృతి
  • ఓటుహక్కు వినియోగించుకుని ఇంటికి వెళ్లి గొలివి అప్పమ్మ (90) మృతి
  • యంబరాం పోలింగ్ కేంద్రంలో ఓటేసిన వృద్ధురాలు

13:15 February 09

పోలింగ్‌ శాతాలు..

తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్​ కొనసాగుతోంది.  మధ్యాహ్నం 12.30 గంటల వరకు 62.02 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. జిల్లాల వారీగా నమోదైన పోలింగ్ వివరాలివి..

జిల్లా పోలింగ్ శాతం
శ్రీకాకుళం 54.58
విశాఖ  65
తూర్పుగోదావరి  62.14
పశ్చిమ గోదావరి 54.07
కృష్ణా 67
గుంటూరు 62
ప్రకాశం 57
నెల్లూరు 61
కర్నూలు 70.6
అనంతపురం 63
కడప 61.19
చిత్తూరు 66.30

13:08 February 09

దుగ్గిరాల పీఎస్‌ వద్ద స్వల్ప ఉద్రిక్తత

  • గుంటూరు: దుగ్గిరాల పీఎస్‌ వద్ద స్వల్ప ఉద్రిక్తత
  • పోలీసులు కొట్టారని సర్పంచ్‌ అభ్యర్థి ఖుషీ బాణావత్ ఆరోపణ
  • పోలింగ్ స్టేషన్ వద్ద బైఠాయించిన ఖుషీ బాణావత్

13:02 February 09

మొర్సుమల్లిలో రెండు పార్టీల మద్దతుదారుల మధ్య ఘర్షణ

మొర్సుమల్లిలో రెండు పార్టీల మద్దతుదారుల మధ్య ఘర్షణ

కృష్ణా జిల్లా మైలవరం మండలం మొర్సుమల్లిలో రెండు పార్టీల మద్దతుదారులు ఘర్షణకు దిగారు. ఇరు వర్గాలు గొడవకు దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాల వారిని సముదాయించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 

12:31 February 09

శ్రీకాకుళం జిల్లా గొట్టిపల్లిలో ఇరువర్గాల మధ్య తోపులాట..

శ్రీకాకుళం జిల్లా గొట్టిపల్లిలో ఇరువర్గాల మధ్య తోపులాట..

శ్రీకాకుళం జిల్లా ఎల్​ఎన్​  పేట మండలం గొట్టిపల్లిలో  పోలింగ్‌ కేంద్రం వద్ద ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఒక వర్గానికి చెందిన దివ్యాంగుడు  వేరే వారి సాయంతో పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లారు. మరో వర్గం వారు అతడ్ని అడ్డుకున్నారు. దీంతో పోలింగ్‌ కేంద్రం వద్ద తోపులాట చోటుచేసుకుంది. ఒకరిని ఒకరు నెట్టుకున్నారు. వెంటనే పోలీసులు ఇరు వర్గాలని చెదరగొట్టారు. 

12:21 February 09

బ్యాలెట్‌ బాక్సులో నీళ్లు..!

  • చిత్తూరు: ఎస్‌.ఆర్‌.పురం మండలం కొత్తపల్లి పంచాయతీలో ఉద్రిక్తత
  • కొత్తపల్లిమిట్టలోని 5వ బూత్‌లో బ్యాలెట్‌ బాక్సులో నీళ్లు పోశారంటూ ఆరోపణ
  • కొత్తపల్లిమిట్టలో తాత్కాలికంగా ఆగిన పోలింగ్‌ ప్రక్రియ
  • పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు

12:19 February 09

ఏజెంట్ల ఆందోళన..

  • చిత్తూరు: వెదురుకుప్పం పీఎస్‌ ఎదుట ఏజెంట్ల ఆందోళన
  • ఆందోళన చేస్తున్న మాంబేడు, ఆర్‌.కె.ఎం.పురం ఏజెంట్లు
  • వైకాపా మద్దతుదారులు దాడి చేసి బూత్‌ నుంచి బయటకు లాగేశారని ఆరోపణ
  • అధికార పార్టీ గుర్తు చూపిస్తూ ఓటేయాలని సిబ్బంది సూచిస్తున్నారని ఆరోపణ

11:56 February 09

వైకాపా, కాంగ్రెస్‌ వర్గీయుల వాగ్వాదం

  • కర్నూలు: గోస్పాడు మం. కానాలపల్లి పోలింగ్‌ కేంద్రం వద్ద వాగ్వాదం
  • కానాలపల్లి పోలింగ్‌ కేంద్రం వద్ద వైకాపా, కాంగ్రెస్‌ వర్గీయుల వాగ్వాదం
  • వాగ్వాదాన్ని అడ్డుకోబోయిన మహిళపై దాడి చేసిన కాంగ్రెస్‌ వర్గీయులు
  • తనపై దాడి చేశారని గోస్పాడు పీఎస్‌లో మహిళ ఫిర్యాదు

11:53 February 09

పోలింగ్ ప్రక్రియ పరిశీలించిన తిరుపతి అర్బన్ ఎస్పీ

  • చిత్తూరు: కమ్మకండ్రిగ పంచాయతీలో పోలింగ్ ప్రక్రియ పరిశీలన
  • పోలింగ్‌ ప్రక్రియను పరిశీలించిన తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు
  • రామచంద్రాపురం, వడమాలపేట మండలాల బూత్‌ల నుంచి ఫిర్యాదులు అందాయి: ఎస్పీ
  • ఓటర్ స్లిప్పులపై గుర్తులు రాసి ఇస్తున్నారని ఫిర్యాదులు అందాయి: ఎస్పీ
  • కొంతమంది ఫిర్యాదు చేసిన మీదట కేసు నమోదు చేశాం: ఎస్పీ
  • కొన్ని ఘటనలను సుమోటోగా తీసుకున్నాం: ఎస్పీ అప్పలనాయుడు

11:42 February 09

ఎస్సైతో వైకాపా నేతల వాగ్వాదం

ఎస్సైతో వైకాపా నేతల వాగ్వాదం
  • గుంటూరు: తెనాలి మండలం అంగలకుదురులో వాగ్వాదం
  • అంగలకుదురులో ఎస్‌.ఐ. రాజేష్‌తో వైకాపా నేతల వాగ్వాదం
  • ఇతర ప్రాంతాల వారికి పోలింగ్‌ బూత్‌ వద్దకు అనుమతి నిరాకరణ
  • అనుమతించాలని ఎస్‌.ఐ.తో వైకాపా నేతల వాగ్వాదం

11:40 February 09

అభ్యర్థి గుర్తుపై.. నోటా

విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో జిల్లా పరిషత్ పాఠశాలలో 5వ నెంబర్ పోలింగ్ బూత్ వద్ద సర్పంచ్ అభ్యర్థి శీలం రంగారావు గుర్తు వంకాయ కాగా.. ఆ గుర్తుపై అధికారులు నోటా అంటించారు. దీంతో సర్పంచ్ అభ్యర్థి ఆగ్రహం చెంది.. అధికారులను ప్రశ్నించారు. అధికారులు సరిచేస్తామని చెప్పారు.

11:36 February 09

అభ్యర్థి గుర్తుపై.. నోటా

            విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో జిల్లా పరిషత్ పాఠశాలలో 5వ నెంబర్ పోలింగ్ బూత్ వద్ద సర్పంచ్ అభ్యర్థి శీలం రంగారావు గుర్తు వంకాయ కాగా.. దానిపై అధికారులు నోటా అంటించారు. దీంతో సర్పంచ్ అభ్యర్థి ఆగ్రహం చెంది.. అధికారులను ప్రశ్నించారు. అధికారులు సరిచేస్తామని చెప్పారు.

11:14 February 09

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్వగ్రామంలో 85 శాతం పోలింగ్‌

  • ప్రకాశం: మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్వగ్రామంలో 85 శాతం పోలింగ్‌
  • ప్రకాశం: కొణిజేడులో ఉదయం 11 గంటల వరకే 85 శాతం పోలింగ్‌

11:10 February 09

ఉదయం 10.30 గంటల వరకు పోలింగ్ శాతం ఇలా..

తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్​ కొనసాగుతోంది. ఉదయం 10.30 గంటల వరకు 34.28 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. జిల్లాల వారీగా నమోదైన పోలింగ్ వివరాలివి..

జిల్లా పోలింగ్ శాతం
శ్రీకాకుళం 29.13
విశాఖ  40.78
తూర్పుగోదావరి  35.07
పశ్చిమ గోదావరి 29
కృష్ణా 36
గుంటూరు 38
ప్రకాశం 28.65
నెల్లూరు 26.72
కర్నూలు 45.85
అనంతపురం 35
కడప 29.21
చిత్తూరు 38.97

10:46 February 09

విరిగిపోయిన స్వస్తిక్​ గుర్తు.. చెక్కతో ఓట్లు

  • విశాఖ: అచ్యుతాపురం మం. పెదపాడు 10వ వార్డులో అభ్యర్థుల ఆందోళన
  • స్వస్తిక్‌ గుర్తు విరిగిపోవడంతో చెక్కను రంగులో ముంచి వేశారని ఆరోపణ
  • స్వస్తిక్ గుర్తు లేకుండా చెక్కతో 150 ఓట్లపై ముద్రించారని అభ్యర్థుల ఆరోపణ

10:20 February 09

ఓటర్లకు పంచుతుండగా ముక్కుపుడకలు, నగదు పట్టివేత

  • కడప: దువ్వూరు మండలం నేలటూరులో పోలీసుల తనిఖీలు
  • 91 ముక్కుపుడకలు, రూ.3 వేలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
  • ఓటర్లకు పంచుతుండగా ముక్కుపుడకలు, నగదు పట్టివేత

10:02 February 09

గుంటూరు జిల్లా గరికపాడులో ఏజెంట్‌ మృతి

గుంటూరు జిల్లా గరికపాడులో ఏజెంట్‌ మృతి
  • గుంటూరు: కాకుమాను మండలం గరికపాడులో ఏజెంట్‌ మృతి
  • 3వ బూత్ ఏజెంట్ నూర్‌బాషా మస్తాన్‌వలి(44) గుండెపోటుతో మృతి
  • ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందిన ఏజెంట్‌ మస్తాన్‌వలి

10:00 February 09

ఓటర్ల ఇబ్బందులు..

  • కృష్ణా: ఇబ్రహీంపట్నం మం. మూలపాడు పోలింగ్ బూత్‌ వద్ద ఓటర్ల ఇబ్బందులు
  • గుర్తింపు కార్డు ఉన్నా స్లిప్పు లేదని వెనక్కి పంపుతున్నారని ఓటర్ల ఆరోపణ

09:54 February 09

తూర్పుగోదావరి జిల్లా ఉప్పలపాడులో ఇరువర్గాల ఘర్షణ

  • తూ.గో.: గండేపల్లి మం. ఉప్పలపాడులో ఇరువర్గాల ఘర్షణ
  • ఉప్పలపాడులో ఇరువర్గాల ఘర్షణ, చెదరగొట్టిన పోలీసులు

09:45 February 09

అనంతపురం జిల్లా పోతుకుంటలో ఘర్షణ

  • అనంతపురం: పుట్టపర్తి మండలం పోతుకుంటలో ఘర్షణ
  • ఒకరి ఓటు మరొకరు వేసేందుకు వచ్చారని వివాదం
  • పోతుకుంటలో పరస్పరం దాడి చేసుకున్న ఏజెంట్లు
  • పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం

09:23 February 09

పోలింగ్‌ శాతాలు..

ఏపీ పంచాయతీ ఎన్నికల తొలి దశ పోలింగ్
  • విశాఖ: అనకాపల్లి డివిజన్‌లో ఎన్నికలు
  • ఉ. 8.30 గంటల వరకు 17.11 శాతం పోలింగ్‌ నమోదు
  • ప.గో.: నరసాపురం డివిజన్‌లో ఎన్నికలు
  • ఉ. 8.30 గంటల వరకు 9.11 శాతం పోలింగ్‌ నమోదు
  • అనంతపురం జిల్లాలోని కదిరి డివిజన్‌లో ఎన్నికలు
  • ఉ. 8.30 గంటల వరకు 7 శాతం పోలింగ్‌ నమోదు
  • కృష్ణా జిల్లాలోని విజయవాడ డివిజన్‌లో ఎన్నికలు
  • ఉ. 8.30 గంటల వరకు 24 శాతం పోలింగ్‌ నమోదు
  • గుంటూరు జిల్లాలోని తెనాలి డివిజన్‌లో ఎన్నికలు
  • ఉ. 8.30 గంటల వరకు 20 శాతం పోలింగ్‌ నమోదు

09:19 February 09

6న అదృశ్యం.. పోలింగ్ రోజు ప్రత్యక్షం

సర్పంచ్‌ అభ్యర్థి మునిరాజు

చిత్తూరు జిల్లా వడమాలపేట పీఎస్‌ ఎదుట.. ఎల్‌.ఎం.కండ్రిగ సర్పంచ్‌ అభ్యర్థి మునిరాజు ప్రత్యక్షమయ్యారు. ఆయన ఈనెల 6 నుంచి కనిపించకుండా పోయారు. మునిరాజు మామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో.. ఉదయం వడమాలపేట పీఎస్ లో ఆయన మళ్లీ కనిపించారు. ప్రత్యర్థులే కిడ్నాప్‌ చేశారని అతని భార్య జ్యోతి ఆరోపించారు.

09:17 February 09

అనకాపల్లి డివిజన్‌లో ఉ. 9 గంటల వరకు 17.11 శాతం పోలింగ్

  • విశాఖ: అనకాపల్లి డివిజన్‌లో ఎన్నికలు
  • 12 మండలాల్లోని 296 పంచాయతీల్లో ఎన్నికలు
  • ఉ. 9 గంటల వరకు 17.11 శాతం పోలింగ్‌ నమోదు

09:07 February 09

కర్నూలు జిల్లా ముత్తలూరులో ఘర్షణ

  • కర్నూలు: రుద్రవరం మండలం ముత్తలూరులో ఘర్షణ
  • ముత్తలూరు పోలింగ్‌ కేంద్రం వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ
  • తమకే ఓటేయాలని ప్రచారం చేస్తున్నారని పరస్పర ఆరోపణలు

08:57 February 09

కృష్ణా జిల్లా జూలూరులో స్వల్ప ఉద్రిక్తత..

కృష్ణా జిల్లా జూలూరులో స్వల్ప ఉద్రిక్తత..
  • కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జూలూరు గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్​లో స్వల్ప ఉద్రిక్తత.
  • వైకాపా తెలుగుదేశం శ్రేణుల మధ్య వాగ్వాదం
  • పరస్పరం నెట్టుకున్న నాయకులు

08:48 February 09

ఎన్నికలు బహిష్కరణ..

ఓటు వేయడానికి వెళ్లని శంభునిపాలెం గ్రామస్థులు
  • నెల్లూరు: అల్లూరు మండలంలో ఓటు వేయడానికి వెళ్లని శంభునిపాలెం గ్రామస్థులు
  • కులధ్రువీకరణ పత్రాలు సరిగా లేవని కొందరి నామినేషన్లు తిరస్కరించిన అధికారులు
  • నామినేషన్లు తిరస్కరించారని ఓటేసేందుకు ఇసుకపల్లి వెళ్లని శంభునిపాలెం గ్రామస్థులు
  • ఓటు వేసేందుకు వెళ్లాలని గ్రామస్థులను కోరుతున్న అధికారులు

08:14 February 09

ఓటు కోసం 25 కిలోమీటర్ల ప్రయాణం

ఓటు కోసం 25 కిలోమీటర్ల ప్రయాణం
  • తూ.గో.: పిల్లంక పంచాయతీ ఎన్నికల్లో ఓటేసేందుకు ఓటర్ల పయనం
  • ఓటు కోసం 25 కిలోమీటర్ల ప్రయాణానికి సిద్ధమైన ఓటర్లు
  • కొత్తలంక నుంచి పలు వాహనాల్లో బయల్దేరిన 285 మంది ఓటర్లు

08:00 February 09

అనంతపురం జిల్లా కొక్కంటిలో అభ్యర్థుల ఏజంట్ల ఆందోళన

  • అనంతపురం: తనకల్లు మం. కొక్కంటిలో అభ్యర్థుల ఏజంట్ల ఆందోళన
  • ఇద్దరిని పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతించని అధికారులు
  • రక్తసంబంధీకులను ఏజంట్లుగా అనుమతించేది లేదంటున్న అధికారులు
  • ముందుగా అనుమతించి వద్దంటున్నారని ఏజంట్ల ఆరోపణ

07:42 February 09

చిత్తూరు జిల్లా కమ్మకండ్రిగలో అభ్యర్థుల ఆందోళన

చిత్తూరు జిల్లా కమ్మకండ్రిగలో అభ్యర్థుల ఆందోళన
  • చిత్తూరు: రామచంద్రాపురం మం. కమ్మకండ్రిగలో అభ్యర్థుల ఆందోళన
  • ఓటరు స్లిప్పులపై గుర్తులు రాసి పంపిస్తున్నారంటూ అభ్యర్థుల ఆందోళన
  • అధికార పార్టీ మద్దతు గుర్తులు వేసి పంపిస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళన

07:28 February 09

అనంతపురం: పోతుకుంటలో ప్రారంభం కాని పోలింగ్‌

  • అనంతపురం: పుట్టపర్తి మం. పోతుకుంటలో ప్రారంభం కాని పోలింగ్‌
  • ఏజంట్లు రాకపోవడంతో పోతుకుంటలో ఇంకా ప్రారంభం కాని పోలింగ్‌

07:17 February 09

తొలి విడత ఎన్నికల కోసం 29,732 పోలింగ్ కేంద్రాలు

  • తొలి విడత ఎన్నికల కోసం 29,732 పోలింగ్ కేంద్రాలు
  • పంచాయతీరాజ్‌ శాఖ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్
  • వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్‌ సరళి పరిశీలించే ఏర్పాట్లు
  • 3,458 సమస్యాత్మక, 3,594 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు
  • ఎన్నికల పరిశీలనకు 519 మంది జోనల్ అధికారులు
  • ఎన్నికల పరిశీలనకు 1,121 మంది రూట్ అధికారులు
  • ఎన్నికల పర్యవేక్షణకు 3,047 మంది సూక్ష్మ పరిశీలకులు
  • పోలింగ్ సిబ్బంది ఆరోగ్య భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు
  • తొలిదశలో ఓటేయనున్న 70 లక్షల మందికి పైగా ఓటర్లు
  • నెల్లూరు జిల్లా వెలిచెర్లలో ఎవరూ నామినేషన్‌ వేయక నిలిచిన పోలింగ్
    ప.గో. జిల్లా బొప్పనపల్లి, వడ్డెగూడెంలో పోలింగ్‌ రెండో దశకు మార్పు
  • శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ డివిజన్లలోని 10 మండలాల్లో ఎన్నికలు
  • అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌లోని 12 మండలాల్లో ఎన్నికలు
  • కాకినాడ, పెద్దాపురం డివిజన్లలోని 20 మండలాల్లో ఎన్నికలు
  • ప.గో. జిల్లా నరసాపురం డివిజన్‌లోని 12 మండలాల్లో ఎన్నికలు
  • విజయవాడ రెవెన్యూ డివిజన్‌లోని 14 మండలాల్లో ఎన్నికలు
  • తెనాలి రెవెన్యూ డివిజన్‌లోని 18 మండలాల్లో ఎన్నికలు
  • ఒంగోలు రెవెన్యూ డివిజన్‌లోని 15 మండలాల్లో పోలింగ్
  • కావలి రెవెన్యూ డివిజన్‌లోని 9 మండలాల్లో ఎన్నికలు
  • కర్నూలు, నంద్యాల డివిజన్లలోని 12 మండలాల్లో ఎన్నికలు
  • కదిరి రెవెన్యూ డివిజన్‌లోని 12 మండలాల్లో ఎన్నికలు
  • కడప, జమ్మలమడుగు, రాజంపేటలోని 14 మండలాల్లో ఎన్నికలు
  • చిత్తూరు రెవెన్యూ డివిజన్‌లోని 20 మండలాల్లో పోలింగ్

06:32 February 09

తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌
  • ప్రారంభమైన తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌
  • మధ్యాహ్నం 3.30 వరకు కొనసాగనున్న పోలింగ్
  • 12 జిల్లాల్లో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌
  • 18 రెవెన్యూ డివిజన్లు, 168 మండలాల్లో తొలిదశ పోలింగ్‌
  • రాష్ట్రవ్యాప్తంగా 2,723 పంచాయతీలకు పోలింగ్‌
  • రాష్ట్రవ్యాప్తంగా 20,157 వార్డులకు తొలిదశలో పోలింగ్‌
  • ఎన్నికల బరిలో 7,506 మంది సర్పంచి అభ్యర్థులు
  • ఎన్నికల బరిలో 43,601 మంది వార్డు అభ్యర్థులు
  • రాష్ట్రవ్యాప్తంగా 525 పంచాయతీలు ఏకగ్రీవం
  • రాష్ట్రవ్యాప్తంగా 12,185 వార్డులు ఏకగ్రీవం
  • పంచాయతీ ఎన్నికల్లో తొలిసారి నోటాకు అవకాశం
  • మధ్నాహ్నం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాలు
  • ఫలితాలు వచ్చిన వెంటనే ఉపసర్పంచి ఎన్నిక
  • కొవిడ్‌ మార్గదర్శకాల మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు
  • పోలింగ్ సిబ్బందికి మాస్కు, శానిటైజర్‌, ఫేస్ షీల్డ్ తప్పనిసరి

06:25 February 09

తూర్పుగోదావరి జిల్లా చినజగ్గంపేటలో ఇరువర్గాల ఘర్షణ

తూర్పుగోదావరి జిల్లా చినజగ్గంపేటలో ఇరువర్గాల ఘర్షణ
  • తూ.గో.: గొల్లప్రోలు మం. చినజగ్గంపేటలో ఇరువర్గాల ఘర్షణ
  • తూ.గో.: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇరువర్గాల ఘర్షణ
  • తూ.గో.: కత్తులతో పరస్పర దాడులు, ఒకరికి తీవ్రగాయాలు

06:22 February 09

ప్రకాశం జిల్లా పల్లెపాలెంలో ఉద్రిక్తత

  • ప్రకాశం: కొత్తపట్నం మండలం పల్లెపాలెంలో ఉద్రిక్తత
  • ఎన్నికలకు డబ్బు పంపిణీ కొందరిని అడ్డుకున్న గ్రామస్థులు

06:20 February 09

బొట్లవారిపల్లెలో అర్ధరాత్రి వైకాపా మద్దతుదారుల హల్‌చల్‌

చిత్తూరు జిల్లా బొట్లవారిపల్లెలో అర్ధరాత్రి వైకాపా మద్దతుదారుల హల్‌చల్‌
  • చిత్తూరు: బొట్లవారిపల్లెలో అర్ధరాత్రి వైకాపా మద్దతుదారుల హల్‌చల్‌
  • పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైకాపా మద్దతుదారుల బెదిరింపులు
  • తాము సూచించిన వ్యక్తినే ఎన్నుకోవాలని స్థానికులకు బెదిరింపులు
  • చిత్తూరు: ప్రతిఘటించి ఆందోళనకు దిగిన గ్రామస్థులు
  • చిత్తూరు: న్యాయం చేయాలంటూ రహదారిపై బైఠాయింపు
  • చిత్తూరు: ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు

06:08 February 09

ఏపీ పంచాయతీ ఎన్నికలు

  • నేడు తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌
  • ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్
  • 12 జిల్లాల్లో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌
  • 18 రెవెన్యూ డివిజన్లు, 168 మండలాల్లో తొలిదశ పోలింగ్‌
  • రాష్ట్రవ్యాప్తంగా 2,723 పంచాయతీలకు పోలింగ్‌
  • రాష్ట్రవ్యాప్తంగా 20,157 వార్డులకు తొలిదశలో పోలింగ్‌
  • ఎన్నికల బరిలో 7,506 మంది సర్పంచి అభ్యర్థులు
  • ఎన్నికల బరిలో 43,601 మంది వార్డు అభ్యర్థులు
  • రాష్ట్రవ్యాప్తంగా 525 పంచాయతీలు ఏకగ్రీవం
  • రాష్ట్రవ్యాప్తంగా 12,185 వార్డులు ఏకగ్రీవం
  • పంచాయతీ ఎన్నికల్లో తొలిసారి నోటాకు అవకాశం
  • మధ్నాహ్నం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాలు
  • ఫలితాలు వచ్చిన వెంటనే ఉపసర్పంచి ఎన్నిక
  • కొవిడ్‌ మార్గదర్శకాల మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు
  • పోలింగ్ సిబ్బందికి మాస్కు, శానిటైజర్‌, ఫేస్ షీల్డ్ తప్పనిసరి
Last Updated : Feb 9, 2021, 6:40 PM IST

ABOUT THE AUTHOR

...view details