రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక సరఫరాను రుణాల్లో కూరుకుపోయిన ప్రైవేటు సంస్థకు అప్పగించారంటూ వస్తున్న ఆరోపణలపై రాష్ట్ర గనుల శాఖ స్పందించింది. పూర్తి పారదర్శక విధానంలోనే జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్‌కు ఇసుక తవ్వకాలు, నిల్వ, విక్రయాల వంటి బాధ్యతలు అప్పగించినట్టు తెలిపింది. నామినేషన్ ప్రాతిపదికన కానీ, రహస్య టెండర్ కానీ ఇవ్వలేదని గనుల శాఖ వివరించింది. ఇసుక విక్రయాలు పారదర్శకంగా ఉండాలనే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ద్వారా ఈ బిడ్డింగ్ చేపట్టినట్టు తెలిపింది. ఎంఎస్టీసీ సంస్థ ద్వారా మాత్రమే పారదర్శక బిడ్డింగ్ లో జయప్రకాశ్ వెంచర్స్ కు ఈ తవ్వకాల టెండర్ దక్కిందని.. ఆ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు.
విమర్శలు అవాస్తవం....
'ఇసుక తవ్వకాలు, విక్రయాలకు ఎంపికైన గుత్తేదారు సంస్థ జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్‌కు అనుభవం లేదని, ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదని, ఆ సంస్థకు ఇసుక ద్వారా రూ.2వేల కోట్లు మిగులుతుందని ఆరోపణలు చేశారు. ఇసుక టన్ను ధర రూ.475గా నిర్ణయించాం. ఏటా 2కోట్ల టన్నుల విక్రయాలతో రూ.950-965 కోట్ల వ్యాపారం జరుగుతుంది. అందులో రూ.765 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాలి. ఆ విధంగా మిగిలిన మొత్తంలో ప్రతి టన్నుకు నిర్వహణ ఛార్జీల కింద రూ.64 తీసేయగా మిగిలేది రూ.36 మాత్రమే. అంటే పెద్ద ఎత్తున పెట్టుబడి పెడితే ఆ గుత్తేదారు సంస్థకు ఏటా రూ.72 కోట్లు మిగులుతుంది.' - రాష్ట్ర పంచాయతీరాజ్, గనుల శాఖ ముఖ్యకార్యదర్శి జీకే ద్వివేది
రీచ్‌ల సంఖ్య పెంపు....