ప్రభుత్వ శాఖల్లో ఒప్పంద పొరుగు సేవల ప్రాతిపదికన మానవనరుల్ని భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ కార్పోరేషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కంపెనీల చట్టం 2013లోని సెక్షన్ 8 ప్రకారం 'ఆంధ్రప్రదేశ్ కార్పోరేషన్ ఫర్ అవుట్ సోర్స్డ్ సర్వీసెస్' పేరిట సంస్థను ఏర్పాటు చేశారు. ఇకనుంచి ప్రభుత్వ విభాగాల్లో వివిధ సేవల కోసం అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ద్వారా చేపట్టే నియామకాలను దీని ద్వారానే చేపట్టనున్నారు. మరోవైపు సెక్యూరిటీ, హౌస్ కీపింగ్, , వాహనాలు, కన్సల్టెన్సీ సేవల కోసం ఏజెన్సీల సేవలనూ ఈ కార్పొరేషన్ ద్వారా పొందవచ్చు. ప్రభుత్వంలోని ఏ విభాగమైనా ఇక అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో ఉద్యోగులను తీసుకునేందుకు ఏపీ కార్పోరేషన్ ఫర్ అవుట్ సోర్సడ్ సర్వీసెస్‌ను సంప్రదించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది
ఏపీ ఒప్పంద పొరుగు సేవల కార్పొరేషన్ ఏర్పాటు - ap outsourcing corporation formed in state
ఏపీ ఒప్పంద పొరుగు సేవల కార్పొరేషన్ ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 'ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్‌సోర్స్‌డ్ సర్వీసెస్' పేరుతో ఈ సంస్థ ఏర్పాటుకానుంది.
![ఏపీ ఒప్పంద పొరుగు సేవల కార్పొరేషన్ ఏర్పాటు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4793212-735-4793212-1571404106556.jpg)
ఏపీ ఒప్పంద పొరుగు సేవల కార్పొరేషన్ ఏర్పాటు
Last Updated : Oct 18, 2019, 7:53 PM IST