ఏపీ నిట్ దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్తమ విద్యా సంస్థ అవార్డును గెలుచుకుంది. సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ గ్రోత్ అండ్ రీసెర్చ్ సంస్థ (దిల్లీ) ఏటా జాతీయ స్థాయిలో విద్య, పరిశోధన రంగాల్లో ప్రతిభ చూపిన విద్యా సంస్థలకు అవార్డులు ప్రకటిస్తుంది. 2020 -21 విద్యా సంవత్సరానికి ఏపీ నిట్ అవార్డును కైవసం చేసుకుంది. సంస్థలో గతేడాది నుంచి కొత్త పాఠ్యాంశాల అమలు, విద్యార్థులకు మౌలిక వసతుల కల్పన, ప్రాంగణ ఎంపికల్లో 86 శాతం మందికి ఉద్యోగావకాశాలు, పరిశోధనలకు అవసరమైన ఆర్థిక వనరులను ప్రభుత్వం నుంచి తీసుకురావడం వంటి అంశాలు అవార్డు రావడానికి దోహదం చేశాయని నిట్ అధికారులు తెలిపారు. డైరెక్టర్ సీఎస్పీ రావు మాట్లాడుతూ సిబ్బంది సమష్టిగా పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందన్నారు.
దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్తమ విద్యా సంస్థగా ఏపీ నిట్ - ap nit got best prize
దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్తమ విద్యాసంస్థగా ఏపీ నిట్ నిలిచింది. 2020-21 విద్యాసంవత్సరానికి జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ చూపినందుకుగాను అవార్డును గెలుచుకుంది.
AP NiT