మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుబాష్ చంద్రబోస్ ల రాజీనామాలతో ఖాళీ అయిన మంత్రి పదవులను..వారి సామాజిక వర్గానికే చెందిన ఎమ్మెల్యేలతో భర్తీ చేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు.. మంత్రి పదవులకు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుల పేర్లు ఖరారయ్యాయి. వీరిద్దరూ మంత్రులుగా బుధవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
రేపు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం
పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణల రాజీనామాలతో ఖాళీ అయిన మంత్రి పదవులకు.. వైకాపా ఎమ్మెల్యేలు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజులు పేర్లు ఖరారు అయ్యాయి. వీరిద్దరితో బుధవారం గవర్నర్ రాజ్ భవన్ లో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. వేణుగోపాలకృష్ణకు రోడ్లు, భవనాల శాఖ, సీదిరి అప్పలరాజుకు మత్స్య, పశుసంవర్థకశాఖ కేటాయించనున్నారు.
విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. వారిచేత మంత్రులుగా ప్రమాణం చేయించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ సహా అతి కొద్దిమంది మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. చెల్లుబోయిన వేణుగోపాల్ కు రహదారులు, భవనాల శాఖ,.. సీదిరి అప్పల రాజుకు మత్స్య, పశుసంవర్థక శాఖలు కేటాయించనున్నారు. ఇక రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కు ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ బాధ్యతలు అప్పగించనున్నారు.
ఇదీ చదవండి :మంత్రివర్గంలోకి వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు..!