ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని! - ap new cs neelam sahni

రాష్ట్రంలో కొత్త CS నియామకానికి రంగం సిద్ధమైంది. 1984 బ్యాచ్‌ IAS అధికారిణి నీలం సాహ్ని పేరును ముఖ్యమంత్రి జగన్‌ ఖరారు చేసినట్లు సమాచారం. పలువురి పేర్ల పరిశీలన తర్వాత ఈ అంశంపై CM ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని!

By

Published : Nov 5, 2019, 6:27 AM IST

రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని నియమితులయ్యే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఒకటి, 2 రోజుల్లో వెలువడతాయని తెలుస్తోంది. ఏపీ క్యాడర్‌కు చెందిన నీలం సాహ్ని ప్రస్తుతం డిప్యుటేషన్‌పై కేంద్ర సాంఘిక న్యాయం, సాధికార మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఐఏఎస్‌ సీనియారిటీ జాబితాలోనూ ఆమె రెండో స్థానంలో ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసి అమరావతి వచ్చిన నీలం సాహ్ని.. సీఎం జగన్‌తో భేటీ అయ్యారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆకస్మిక బదిలీ నేపథ్యంలో కొత్త సీఎస్‌ నియామకంపై విస్తృత చర్చలు మొదలయ్యాయి. సీనియారిటీ ప్రాతిపదికన చూస్తే 1983 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ప్రీతి సూదన్‌ ముందున్నారు. తర్వాత 1984 బ్యాచ్‌ అధికారుల్లో భార్యాభర్తలైన నీలం సాహ్ని, అజయ్ సాహ్ని ఉండగా.. 1985 బ్యాచ్‌లో డాక్టర్‌ సమీర్‌ శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం, 1986 బ్యాచ్‌లో డి.సాంబశివరావు, అభయ్‌ త్రిపాఠి, సతీస్‌ చంద్ర సీనియర్లుగా ఉన్నారు. వీరిలో డి.సాంబశివరావు, సతీశ్‌చంద్ర మాత్రమే ప్రస్తుతం రాష్ట్ర సర్వీసుల్లో పని చేస్తున్నారు. జాబితాలో ముందున్న ప్రీతి సూదన్‌ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అజయ్‌ సాహ్ని ఎలక్ట్రానిక్‌ ఐటీ విభాగంలో కార్యదర్శిగా పని చేస్తున్నారు. సమీర్‌ శర్మ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ కార్పొరేట్‌ అఫైర్స్‌ డీజీ, సీఈవోగా వ్యవహరిస్తున్నారు. రెడ్డి సుబ్రహ్మణ్యం మానవ వనరుల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా కీలకమైన విధానాల రూపకల్పన బాధ్యతలు చూస్తున్నారు. సీఎస్‌గా మరికొందరి పేర్లు వినిపిస్తున్నా.. రెండో స్థానంలో ఉన్న నీలం సాహ్ని నియామకానికే సీఎం జగన్‌ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని!

ABOUT THE AUTHOR

...view details