రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఆదిత్యనాథ్ దాస్ ముఖ్యమంత్రి జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీలో సీఎం జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నూతన సీఎస్ వెంట డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉన్నారు. ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజు నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఆదిత్యనాథ్‌దాస్ సర్వీసు మరో ఆరు నెలలు?
కొత్త సీఎస్‌గా నియమితులైన ఆదిత్యనాథ్‌దాస్ సొంత రాష్ట్రం బిహార్. 1961 జూన్ 30న జన్మించారు. ఆయన 2021 జూన్ నెలాఖరున పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తే... ఆయన సర్వీసును కేంద్ర ప్రభుత్వం గరిష్ఠంగా మరో ఆరు నెలలు పొడిగించే అవకాశం ఉంది. ఐఏఎస్ అధికారిగా ఆదిత్యనాథ్‌దాస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, విభజన తర్వాత పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. నీటిపారుదల శాఖ బాధ్యతల్ని ఎక్కువ కాలం చూశారు.