ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'జులై 15 తర్వాత షూటింగులు​.. త్వరలోనే విధి విధానాలు' - minster perni nani comments on nandi awards news

రాష్ట్రంలో సినీ చిత్రీకరణలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సినీ ప్రముఖుల విజ్ఞప్తి మేరకు సీఎం జగన్​ జులై 15 తర్వాత షూటింగులకు అనుమతిచ్చినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

'జులై 15 తర్వాత సినిమా షూటింగులు​.. త్వరలోనే విధి విధానాలు'
'జులై 15 తర్వాత సినిమా షూటింగులు​.. త్వరలోనే విధి విధానాలు'

By

Published : Jun 9, 2020, 5:04 PM IST

Updated : Jun 9, 2020, 5:31 PM IST

సినిమా షూటింగులపై మంత్రి పేర్నినాని స్పష్టత

రాష్ట్రంలో జులై 15 తర్వాత సినిమా షూటింగులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని మంత్రి పేర్నినాని తెలిపారు. దీనికి సంబంధించి త్వరలోనే విధి విధానాలు ఖరారు చేస్తామని అన్నారు. సినిమా టికెట్లు ఆన్​లైన్​లోనే ఇవ్వాలని సీఎం జగన్​ ఆదేశించినట్లు చెప్పారు. నంది అవార్డులు పునరుద్ధరించాలన్న సినీ ప్రముఖుల విజ్ఞప్తి మేరకు.. 2019 నుంచి నంది అవార్డులు ప్రదానం చేసేందుకు సీఎం జగన్​ అంగీకరించినట్లు తెలిపారు.

విశాఖలో సినీ స్టూడియోల నిర్మాణానికి సినీ పెద్దలకు స్థలాలు ఇచ్చేందుకు సీఎం జగన్​ అంగీకరించారని మంత్రి పేర్ని నాని తెలిపారు. సినీ పరిశ్రమకు అన్ని విధాలా అండగా ఉంటానని సీఎం హామీ ఇచ్చారన్న ఆయన.. పరిశ్రమ పట్ల ఆదరణకు సినీ ప్రముఖులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారని వెల్లడించారు.

Last Updated : Jun 9, 2020, 5:31 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details