ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

KODALI NANI IN BHADRACHALAM : భద్రాద్రి రామయ్య సేవలో మంత్రి కొడాలి నాని - ap minister kodali nan

KODALI NANI Prayers at BHADRADRI : మంత్రి కొడాలి నాని భద్రాచలం రాముడ్ని దర్శించుకున్నారు. కుటుంబసమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కానుకలు అందజేశారు.

భద్రాద్రి రామయ్య సేవలో మంత్రి కొడాలి నాని
భద్రాద్రి రామయ్య సేవలో మంత్రి కొడాలి నాని

By

Published : Dec 7, 2021, 3:54 PM IST

KODALI NANI visits BHADRADRI Rama Temple: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సోమవారం సందర్శించారు. కుటుంబసభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయం వద్దకు వచ్చిన మంత్రి దంపతులకు ఆలయ ఈవో శివాజీ ఘనస్వాగతం పలికారు. వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు, అర్చకులు శాలువాతో సత్కరించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి క్షేమంగా ఉండాలని, తమ కుటుంబసభ్యులు, ఇరు రాష్ట్రాల ప్రజలు క్షేమంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. అనంతరం మంత్రి దంపతులు స్వామివారికి రూ.13 లక్షల విలువ గల వైరముడి కిరీటం, అమ్మవారికి పట్టుచీరను కానుకగా సమర్పించారు.

ఇదీచదవండి. : Prabhas Donation to AP: సీఎం సహాయనిధికి హీరో ప్రభాస్‌ విరాళం..ఎంతిచ్చాడంటే..?

ABOUT THE AUTHOR

...view details