ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చేవారికి సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద కొవిడ్ పరీక్షలు చేయనున్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. పరీక్షలకు సమయం పట్టే అవకాశం ఉన్నందున ప్రజలు సహకరించాలని కోరింది.
పరీక్షల్లో నెగెటివ్ వస్తే 14 రోజులపాటు హోమ్ క్వారంటైన్ అని.. పాజిటివ్ వస్తే గవర్నమెంట్ క్వారంటైన్ అని.. వైద్యారోగ్య శాఖ తెలిపింది. వ్యాధిగ్రస్తులకు కూడా ప్రత్యేక పరీక్షలు చేయనున్నారు.