ఈనెల 20 నుంచి టోల్ ఫీజులు అమలోకి వస్తాయంటూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను... లాక్ డౌన్ ముగిసే వరకు నిలుపుదల చేయాలని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. లాక్ డౌన్ ఉన్నంత కాలం టోల్ మినహాయింపు ఇవ్వాలని కోరుతూ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు లేఖ రాసింది. అసలే ఆగిపోయిన లారీలు రాష్ట్రానికి తిరిగి రాక ఇబ్బందులు పడుతుంటే కేంద్రం.. ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వటం ఆమోదయోగ్యంగా లేదని స్పష్టం చేసింది. టోల్ మినహాయింపును పొడిగించాలని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావు ఈమేరకు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
'లాక్డౌన్ ముగిసే వరకు టోల్ మినహాయింపు ఇవ్వండి' - ఏపీ లాక్ డౌన్ వార్తలు
లాక్ డౌన్ ఉన్నంత కాలం టోల్ మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్.... నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు లేఖ రాసింది.
ap-lorry-owners-association