కరోనాపై పోరులో భాగంగా జ్యోతిప్రజ్వలన చేశారు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. ప్రధాని పిలుపుకు ప్రతి స్పందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కాంతి వెలుగులతో కరోనా చీకటికి ముగింపు ఖాయమన్నారు. దేశాన్ని రక్షించునే క్రమంలో రాష్ట్ర ప్రజలంతా ఐక్యతను చాటడం ఆనందంగా ఉందన్నారు.
హైదరాబాద్ లో.. కుటుంబసభ్యులతో కలిసి దీపప్రజ్వలన చేశారు తెదేపా అధినేత చంద్రబాబు. ప్రధాని పిలుపునకు మద్దతుగా దీపాలు వెలిగించారు.