రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించింది. తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం..మరో 33 మంది నమూనాల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల్లో 17 వేల 837 పడకలతో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి. ఇప్పటి వరకు విదేశాల నుంచి రాష్ట్రానికి 26 వేల 59 మంది వచ్చారు. వీరందరిపైనా పర్యవేక్షణ కొనసాగుతోంది. విమానాల రద్దుతో విదేశాల నుంచి వచ్చే వారు పూర్తిగా నిలిచిపోయారు. తెలంగాణ నుంచి రాష్ట్రంలోకి వచ్చే వారందరినీ క్వారంటైన్ కేంద్రాలకు తరలించేందుకు నిర్ణయించారు. 14 రోజుల పాటు క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్న తర్వాతే వీరిని ఇళ్లకు పంపుతారు.
'తెలంగాణ నుంచి వచ్చే వారు క్వారంటైన్‌లో ఉండాల్సిందే' - Health_Bulletin_Issued_in andhra
రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులు 10 నమోదైనట్ల వైద్య ఆరోగ్యశాఖ తాజా బులెటిన్ లో తెలిపింది. మరో 33 మంది ఫలితాలు వెల్లడికావాల్సి ఉందని వివరించింది. తెలంగాణ నుంచి వచ్చే వారు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని పేర్కొంది.
తెలంగాణ నుంచి వచ్చే వారు క్వారంటైన్‌లో ఉండాల్సిందే: ఆరోగ్యశాఖ