కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్న వివిధ సంస్థల ఉద్యోగులు, ప్రజలకు నిరంతరాయంగా టెలికాం, ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇంటి వద్ద నుంచే పనిచేసేందుకు వివిధ ప్రైవేటు సంస్థలు, కొన్ని ప్రభుత్వ విభాగాలు తమ ఉద్యోగులను ఆదేశించిన నేపథ్యంలో... టెలికాం, ఇంటర్నెట్ సేవలకు ఎక్కడా అంతరాయం కలగకుండా చూడాల్సిందిగా ఆపరేటర్లను ఆదేశించింది. ప్రత్యేకించి రాష్ట్రంలో టెలికాం, ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న సంస్థలు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని ఐటీ శాఖ స్పష్టం చేసింది. వైద్యపరంగా ప్రభుత్వం అత్యవసర స్థితిని ఉపసంహరించేంత వరకూ ఈ సేవలు నిరంతరాయంగా అందించాలని స్పష్టం చేసింది.
టెలికాం, ఇంటర్నెట్ నిరంతర సేవలకు ప్రభుత్వ ఆదేశాలు - ఏపీ కరోనా వార్తలు
కరోనా నిరోధక చర్యల్లో భాగంగా ఇంటి నుంచే పనిచేస్తున్న వారందరికీ నిరంతరం టెలికాం, ఇంటర్నెట్ సేవలు అందించాలని ఆపరేటర్లను ప్రభుత్వం ఆదేశించింది. సేవల్లో అంతరాయం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐటీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకూ సేవలు కొనసాగించాలని స్పష్టం చేసింది.
నిరంతర టెలికాం, ఇంటర్నెట్ సేవలకు ప్రభుత్వ ఆదేశాలు