ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నీటి యాజమాన్య పద్ధతులు, రూపకల్పన భేష్‌ - AP is the top in water management practices and design

నీటి యాజమాన్య సూచికలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సత్తా చాటాయి. వివిధ విభాగాల్లో తొలి స్థానంలో నిలిచాయి. నీటి వినియోగం, నీటి వనరుల పునరుద్ధణ పొదుపు చర్యలపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నివేదికను విడుదల చేసింది.

నీటి యాజమాన్య పద్ధతులు, రూపకల్పనలో ఏపీ అగ్రస్థానం

By

Published : Aug 23, 2019, 7:52 PM IST

Updated : Aug 24, 2019, 12:04 PM IST


నీతిఆయోగ్‌ విడుదల చేసిన సమగ్ర నీటి యాజమాన్య సూచికలో ఆంధ్రప్రదేశ్‌ 74 మార్కులతో దేశంలో రెండో స్థానంలో నిలిచింది. 75 పాయింట్లతో గుజరాత్‌ మొదటి స్థానంలో, 71 పాయింట్లతో మధ్యప్రదేశ్‌ ముడోస్థానంలో నిలిచాయి. జలవనరుల సంరక్షణ, సాగు, తాగునీటి సరఫరా విషయంలో తీసుకుంటున్న చర్యల ఆధారంగా రాష్ట్రాల పనితీరును అంచనా వేసి నీతిఆయోగ్‌ మూడేళ్లుగా నివేదికలు ఇస్తోంది. 2018-19 నివేదికను శుక్రవారం కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, నీతిఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్‌, సీఈవో అమితాబ్‌కాంత్‌లు విడుదల చేశారు.భూగర్భజలాల రీఛార్జి ప్రాంతాల మ్యాపింగ్‌ను 100% పూర్తిచేయడంతోపాటు, రాష్ట్రంలోని 15 లక్షల బోరుబావుల్ని పూర్తిగా జియోట్యాగ్‌ చేసి అందులోని భూగర్భజలాల స్థాయిని ఆన్‌లైన్‌ ద్వారా ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నట్లు పేర్కొంది. సాగునీటి సామర్థ్య కల్పన, వినియోగంలో ఆంధ్రప్రదేశ్‌ 100% స్కోర్‌ సాధించింది.
*నీరు- చెట్టు కార్యక్రమం కింద 7 వేల పంటకుంటలు, 22 వేల చెక్‌డ్యాంలు మరమ్మతు చేయడంతోపాటు, కొత్తగా 102 ఎత్తిపోతల పథకాలను వినియోగంలోకి తెచ్చి 2.10 లక్షల ఎకరాలకు సాగునీటి యోగ్యం కల్పించారు.
*భారీ, మధ్యతరహా సాగునీటి సరఫరాలోనూ ఆంధ్రప్రదేశ్‌ 80కి పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
*అనంతపురం జిల్లాలో 51,825 వాననీటి సంరక్షణ నిర్మాణాలు చేపట్టడంతో 15,783 హెక్టార్లకు అదనంగా సాగునీటి సౌకర్యం లభించింది. 40 వేల మంది రైతులకు శిక్షణ ఇవ్వడం వల్ల ఈ జిల్లాలో 39,801 హెక్టార్లలో సూక్ష్మసేద్యం పెరిగింది.
*కడప జిల్లాలోని పాపాగ్ని నదిపై తక్కువ ఖర్చుతో ఆరుచోట్ల సబ్‌ సర్ఫేస్‌ డ్యామ్‌లు నిర్మించింది. ఈ ప్రాజెక్టుకు 2018 నేషనల్‌ వాటర్‌ అవార్డు దక్కింది.
*ఆంధ్రప్రదేశ్‌లో అన్ని గ్రామాలకూ పైపుల ద్వారా నీరందుతోంది.

Last Updated : Aug 24, 2019, 12:04 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details