ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేటి నుంచి ఇంటర్​ అడ్మిషన్లు.. ఆన్​లైన్​లో దరఖాస్తులు

2020 - 21 విద్యా సంవత్సరానికి ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్​ బోర్డు ప్రకటించింది. కొవిడ్ దృష్ట్యా ఆన్​లైన్​ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

Ap intermediate admission 2020
Ap intermediate admission 2020

By

Published : Oct 20, 2020, 8:49 PM IST

Updated : Oct 21, 2020, 12:32 AM IST

2020-21 విద్యా సంవత్సరానికి ఇంటర్ అడ్మిషన్లు ప్రక్రియను ప్రభుత్వం ఖరారు చేసింది. రెండేళ్ల ఇంటర్ కోర్సులు, ఒకేషనల్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. ఆన్‌లైన్ ద్వారా అడ్మిషన్ ప్రక్రియ చేపట్టాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. అడ్మిషన్ల కోసం bie.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్ బోర్డు తెలిపింది.

బుధవారం నుంచి ఈ నెల 29వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. సందేహాలుంటే టోల్ ఫ్రీ నెంబరు 1800 274 9868కు ఫోన్ చేయవచ్చని సూచించారు.

Last Updated : Oct 21, 2020, 12:32 AM IST

ABOUT THE AUTHOR

...view details