విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక కారిడార్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్ ఉత్తర్వులు ఇచ్చారు. దీనికి అనుబంధంగా ఎగ్జిక్యూటివ్ కమిటీని కూడా నియమిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు.
ఏపీఐసీడీఏ ఛైర్మన్‌గా సీఎం జగన్ - ఏపీ పారిశ్రామిక కారిడార్ వార్తలు
విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక కారిడార్ డెవలప్‌మెంట్ అథారిటీని(ఏపీఐసీడీఏ) ఏర్పాటుచేసింది. దీనికి అనుబంధంగా ఎగ్జిక్యూటివ్ కమిటీని కూడా నియమిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అథారిటీ సీఎం జగన్ అధ్యక్షతన పనిచేయనుంది. పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి ఉపాధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు.
విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ కోసం ప్రత్యేక అథారిటీ ఏర్పాటు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఏపీ పారిశ్రామిక కారిడార్ డెవలప్‌మెంట్ అథారిటీ పనిచేయనుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కోంది. ఈ అథారిటీ ఉపాధ్యక్షుడిగా పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, సభ్యులుగా ఆర్థికశాఖ మంత్రి, ఇతర ఉన్నతాధికారులు ఉంటారని ప్రభుత్వం తెలిపింది. ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇదీ చదవండి :'రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు అవసరం లేదు'