ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆకాంక్షిత జిల్లాల పురోగతిలో మూడో స్థానంలో ఏపీ - ఆకాంక్షిత జిల్లాల పురోగతిలో మూడో స్థానంలో ఏపీ న్యూస్

నీతి ఆయోగ్‌ తలపెట్టిన ‘ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధి కార్యక్రమం’లో 66.67% మార్కులతో (స్కోర్‌)తో ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో నిలిచింది. విద్య, వైద్యం, వ్యవసాయం- జలవనరులు, ప్రాథమిక మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక సమ్మిళితపరంగా దేశంలోని మిగతా జిల్లాల కంటే వెనకబడిన 112 జిల్లాలను ముందుకు తీసుకువెళ్లేందుకు నీతి ఆయోగ్‌ ఈ కార్యక్రమం చేపట్టింది.

AP in third place
AP in third place

By

Published : Nov 27, 2020, 10:54 AM IST

2018లో ప్రారంభమైన ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధి కార్యక్రమం ద్వారా క్షేత్ర స్థాయిలో ఎంత మేరకు పరిస్థితుల్లో మార్పు వచ్చిందో తెలుసుకోవడానికి ఇటీవల నీతి ఆయోగ్ అధ్యయనం చేశారు.. ఈ కార్యక్రమంలో చేరక ముందు నాటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పటికి ఛత్తీస్‌గఢ్‌ 80%, ఒడిశా 70%, ఆంధ్రప్రదేశ్‌ 66.67%, ఝార్ఖండ్‌ 63% పురోగతి సాధించి తొలి నాలుగు స్థానాల్లో నిలిచినట్లు నివేదిక పేర్కొంది. ఆరోగ్యం, పోషకాహార విభాగంలో నిర్దేశించిన లక్ష్యాలను ఆంధ్రప్రదేశ్‌లోని కడప, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు దాదాపుగా చేరుకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details