ఏపీ అటవీశాఖ అధికారి వి.బి.రమణమూర్తి ఆత్మహత్య - ఏపీ అటవీశాఖ అధికారి వి.బి.రమణమూర్తి ఆత్మహత్య
10:49 October 01
హైదరాబాద్‌లో ఏపీ అటవీశాఖ అధికారి వి.బి.రమణమూర్తి ఆత్మహత్య
హైదరాబాద్‌లో ఏపీ అటవీశాఖ అధికారి వి.బి.రమణమూర్తి ఆత్మహత్య చేసుకున్నారు. నాగోల్ బండ్లగూడలోని రాజీవ్ గృహకల్ప భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాత్రి 2 గంటల సమయంలో ఐదో అంతస్తు నుంచి దూకినట్లు పోలీసులు గుర్తించారు.
మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఏపీ అటవీశాఖలో అడిషనల్ చీఫ్ కన్జర్వేటర్‌గా పని చేస్తున్నారు. విధినిర్వహణలో ఒత్తిడి వల్లే తన భర్త మరణించారని ఆయన భార్య ఆరోపిస్తున్నారు.