ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల జారీపై స్టేటస్‌ కో: హైకోర్టు - జర్నలిస్టుల అక్రెడిటేషన్ల జారీపై యథాతథ స్థితి

రాష్ట్ర, జిల్లా మీడియా అక్రెడిటేషన్‌ కమిటీల ఏర్పాటుకు సాధారణ పరిపాలనశాఖ డిసెంబరు 8న జీవో 123 ను జారీ చేసింది. ఆ ఉత్తర్వుల ఆధారంగా జర్నలిస్టులకు గుర్తింపు కార్డులిచ్చే ప్రక్రియపై.. నాలుగు వారాల పాటు యథాతథ స్థితి (స్టేటస్‌ కో) పాటించాలని హైకోర్టు ఆదేశించింది. సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి, సమాచార పౌర సంబంధాలశాఖ కమిషనరుకు నోటీసులు జారీచేస్తూ కౌంటరు దాఖలు చేయాలని పేర్కొంది.

ap Hight court On Accreditations
ap Hight court On Accreditations

By

Published : Jan 6, 2021, 8:51 AM IST

జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియపై నాలుగు వారాలు యథాతథ స్థితి పాటించాలంటూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. సాధారణ పరిపాలన శాఖ, పబ్లిక్ ‌రిలేషన్స్‌ ముఖ్య కార్యదర్శి, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కు నోటీసులు జారీ చేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను ఈ నెల 25 కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.విజయలక్ష్మి ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.

రాష్ట్ర, జిల్లా స్థాయి మీడియా అక్రిడిటేషన్ కమిటీల ఏర్పాటు నిమిత్తం ప్రభుత్వం జీవో 123 ని జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ మీడియా ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి పి. దిల్లీబాబురెడ్డి హైకోర్టులో పిల్ వేశారు. ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని.. జర్నలిస్టులకు ప్రస్తుతం ఉన్న అక్రెడిటేషన్లకు ఆటంకం కలిగించొద్దని కోరారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ .. కమిటీలు ఏర్పాటు చేశాక కొంతమంది జర్నలిస్టులకు కొత్త కార్డులు జారీచేశామని చెప్పారు.

ఈ వ్యవహారంపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేశాకే తేల్చగలమని న్యాయమూర్తి అభిప్రాయం వ్యక్తంచేశారు. అయితే.. ఆ జీవోను ఆధారం చేసుకొని అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియపై నాలుగు వారాలు స్టేటస్‌కో పాటించాలని ఆదేశించారు.

ఇదీ చదవండి:

సీఎం జగన్ ప్రోత్సాహంతో మత మార్పిడులు: చంద్రబాబు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details