ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆ వ్యాజ్యంపై నేరుగానే విచారిస్తాం: హైకోర్టు - Contempt of court petition in ap

న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసులో 93 మందిపై సుమోటోగా నమోదు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై ప్రత్యక్ష విచారణ జరపాలని హైకోర్టు నిర్ణయించింది. వైకాపా ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌తోపాటు పలువురు న్యాయవాదులు, జర్నలిస్టులు ఈ కోర్టు ధిక్కరణ జాబితాలో ఉన్నారు.

ap high court
ap high court

By

Published : Nov 24, 2020, 5:36 AM IST

న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టింగులు పెట్టి చర్చలు జరిపిన 93 మందికి సంబంధించిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై హైకోర్టు ప్రత్యక్ష విచారణ జరపనుంది. నేరుగా విచారణ ప్రక్రియ ప్రారంభమయ్యాక ఈ వ్యాజ్యాన్ని కేసులు జాబితాలో వచ్చేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీని న్యాయస్థానం సోమవారం ఆదేశించింది.

వైకాపా ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌తోపాటు పలువురు న్యాయవాదులు, జర్నలిస్టులు ఈ కోర్టు ధిక్కరణ జాబితాలో ఉన్నారు. తాజాగా ఈ వ్యాజ్యంపై విచారించిన న్యాయస్థానం ప్రతివాదులు ఎక్కువ మంది ఉన్నందున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ కష్టమని నేరుగానే విచారిస్తామని తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details